Betal Leaf Deepam : తమలపాకుతో దీపం పెడితే కలిగే లాభాలు.. మీరు ఊహించలేరు…!
ప్రధానాంశాలు:
Betal Leaf Deepam : తమలపాకుతో దీపం పెడితే కలిగే లాభాలు.. మీరు ఊహించలేరు...!
Betal Leaf Deepam : ప్రతి పూజలో తమలపాకులు అనేవి కచ్చితంగా ఉండి తీరాలి. అలాగే ప్రతి ఒక్క పూజలో తమలపాకులను కచ్చితంగా ఉపయోగిస్తారు. అలాగే ఇంట్లో పూజలు ఉన్న లేక వ్రతాలు ఉన్న, శుభ సూచకమైన, ఫంక్షన్లు జరిగిన కచ్చితంగా తమలపాకులనేవి ఉండాల్సిందే. అయితే ఈ తమలపాకును శుభానికి ప్రతికగా చెబుతూ ఉంటారు. అలాగే తాంబూలం తో పాటు కూడా తమలపాకులను పెడతారు. ఈ తమలపాకును తీసుకోవడం వలన కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్లు తమలపాకు మీద దీపం పెట్టండి అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ పెద్దగా ఈ విషయాన్ని మనం పట్టించుకోము. కానీ ఈ తమలపాకు కాడలో పార్వతి దేవి మరియు తమలపాకు మొదట్లో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి దేవి కొలువై ఉంటారంట…
అందుకే తమలపాకులో దీపం పెట్టడం వలన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అని మరియు అనుకున్నా కోరికలు అనేవి త్వరగా నెరవేరతాయి అని చెబుతూ ఉంటారు. అలాగే తమలపాకు మీద దీపాలను పెట్టడం వలన మంచి ఫలితాలు కూడా పొందుతారు. అలాగే మన జీవితంలో అపజయం అనేది అసలు ఉండదు అని పెద్దలు మరియు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు కూడా తమలపాకు దీపం పెట్టాలి అని అనుకుంటే, దీనికోసం మీరు ముందుగా ఆరు తమలపాకులను తీసుకోవాలి. తర్వాత ఆ తమలపాకులకు ఉన్న కాడలను తుంచేయాలి…
ఇప్పుడు మీరు ఈ ఆకుల్ని నెమలి పించం లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన మట్టి ప్రమిద ఉంచి ముందుగా తుంచి నటువంటి కాడలను దీపంలో వేసి నువ్వుల నూనె కూడా వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ తమలపాకులతో దీపం వెలిగించటం వలన అనుకున్నటువంటి అన్ని పనులు కూడా తొందరగా పూర్తి అవుతాయి అని అంటారు