Birds : ఈ పక్షులు మీ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా… జరగబోయేది ఇదే…!
ప్రధానాంశాలు:
Birds : ఈ పక్షులు మీ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా... జరగబోయేది ఇదే...!
Birds : మన ఇంట్లోకి ఎలాంటి పక్షులు వస్తే లక్ష్మీప్రదం…?ఎలాంటి పక్షులు వస్తే ఆశుభం కలుగుతుంది….? అయితే ఈ విషయాల గురించి చాలామందికి అస్సలు తెలియదు. ఈ పక్షులు కీటకాలు అనేవి ప్రకృతిలో మమేకమై ఉంటాయి. ఇక మన జీవితంలో రాబోయే మార్పుల గురించి అవి ముందుగానే మనకు హెచ్చరిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇప్పుడున్న బిజీ కాలంలో వాటిని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ మన పూర్వీకులు వీటిని చాలా దృఢంగా నమ్మేవారు. పక్షులు వాటి కదలికల గురించి శగుణ శాస్త్రంలో కూడా వివరించి చెప్పడం జరిగింది. మన పెద్దలు కూడా వాటి కదలికల ద్వారా వారి జీవితంలో రాబోయే మార్పులను ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మెసులుకునేవారు. మరి ఎలాంటి పక్షులు మన ఇంట్లోకి వస్తే శుభప్రదం అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే పక్షులలో పిచ్చుకలు శుభప్రదంగా మన శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందుకే మన పెద్దలు ఆ కాలంలో ఇంటిదగ్గర ధాన్యపు గింజలను కట్టి వాటిని మచ్చిక చేసుకునేవారు.
ఇక ఈ పిచ్చుకలు అనేవి పాజిటివ్ కు సంకేతమని చెప్పాలి. అయితే మన ఇంట్లోకి పిచ్చుకలు వచ్చే తీరును బట్టి కొన్నిటిని అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే జంట పిచ్చుకలు పదేపదే మీ ఇంటికి వస్తున్నట్లయితే త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుందని అర్థమట. అదేవిధంగా మీ ఇంట్లో కొత్త దంపతులు ఉన్నట్లయితే వారికి త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఈ జంట పిచ్చుకలు తెలియజేస్తాయట. అదేవిధంగా పిచ్చుకలు మీ ఇంట్లో గూడు కట్టుకుంటే చాలా మంచిదట. పిచ్చుకలు మీ ఇంటి పరిసరాల్లో గూడు కట్టుకుని పిల్లలు పెట్టినట్లయితే ఇక నుండి మీ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని అర్థమట. అదేవిధంగా చాలామంది గుడ్లగూబను చూడగానే భయపడి పోతారు. గుడ్లగూబ అరుపులు విన్న అది ఇంట్లోకి వచ్చిన ఏదో జరగబోతుందని భయపడుతుంటారు. దానిని అశుభంగా భావిస్తారు. కానీ గుడ్లగూబ అనేది లక్ష్మీదేవి వాహనం.
అలాంటి గుడ్లగూబ మీ ఇంట్లోకి ప్రవేశించింది అంటే త్వరలోనే మీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుందని అర్థమట. అదేవిధంగా కాకి మన ఇంటి ముందు వాలితే దానిని తరిమేస్తాం. కానీ అలా ఎప్పుడూ చేయకూడదట. ఎందుకంటే కాకిని మన పితృదేవతలకు ప్రతినిధిగా చెబుతుంటారు. అలాగే మనం కాకికి పెట్టే ఆహారం పైన ఉన్న మన పితృదేవతలకు చేరుతుంది. దీంతో వారి ఆత్మ శాంతిస్తుందని పెద్దలు నమ్మకం. అదే విధంగా కందిరీగలు మీ ఇంట్లో గూడు కట్టుకున్న కూడా శుభ సూచికమేనట. అదేవిధంగా మీకు మీ ఇంటి పరిసరాల్లో పదేపదే రామచిలుకలు కనిపిస్తున్నట్లయితే మీ ప్రార్థనలన్నీ ఫలించి త్వరలోనే మీకు మంచి జరగబోతుంది అని అర్థమట.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీని ధృవీకరించలేదు.