Viral Video : బేబీ ఏమైంది.. నన్ను డిస్ట్రబ్ చేయకు ప్లీజ్ నా మూడ్ బాగలేదు.. పక్షుల విరహ వేదన
Viral Video : మనలోనే కాదు జంతువులు, పక్షుల్లో కూడా ప్రేమ.. స్నేహం ఉంటాయి. మనుషులు ఎలాగైతే తమ ప్రేమను చాటుకోవడానికి.. అవతలి వ్యక్తిపై ఇష్టాన్ని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తారో అలాగే పక్షులూ, జంతువులూ కూడా చేస్తాయి. నిజానికి జంతు ప్రపంచంలోకి ఒకసారి తొంగి చూస్తే ఎన్నో ముచ్చట గొలిపే సంఘటనలు కనిపిస్తాయి. ఒక్కోసారి అవి చేసే పనులు ముచ్చటేస్తుంటాయి కూడా. అలాగే అవి చేసే పనులు చాలా క్యూట్ గా.. చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉంటాయి.
అయితే మనుషులే కాదు పక్షులూ ప్రేమలో పడుతుంటాయి. పక్షుల్లో కూడా ప్రేమ, విరహ వేదన ఉంటాయని నిరూపిస్తాయి కొన్ని సంఘటనలు.పక్షులు రకరకాలుగా ప్రవర్తిస్తుంటాయి. తమకి ఇష్టమైన పక్షులకు నోటితో ఆహారాన్ని తినిపిస్తుంటాయి. తలపై, శరీరంపై నిమురుతూ ఉంటాయి. తమకి నచ్చిన వాటి కోసం ఆహారాన్ని తెస్తుంటాయి. చిలిపి పనులు చేస్తుంటాయి. గొడవపడుతుంటాయి. కొన్ని సార్లు బుజ్జగిస్తుంటాయి.. ఇలా చాలా వేరియేషన్స్ చూపిస్తుంటాయి. ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Birds please do not disturb me Viral Video
అదేంటో చూద్దాం..ఈ వీడియోలో రెండు పక్షులను చూస్తుంటే ఇదివరకే గొడవపడినట్టు కనిపిస్తున్నాయి. ఓ పక్షిని పక్కన ఉన్న మరో పక్షి బుజ్జగిస్తున్నట్లు ఉంది. అ పక్షి ఏమో చిరాకుగా చూస్తూ నన్ను డిస్ట్రబ్ చేయకు అని కోపంగా చూస్తున్నట్లు ఉంది. అయినా వినకుండా ఈ పక్షి దాని ఈకలను నోటితో లాగుతూ ఇంకా అతి చేస్తోంది. దీంతో ఆ పక్షి నేను భాదలో ఉంటే నీ భాద ఏంట్రా అన్నట్లు చూస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఫన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి ఇంకా లేటెందుకు..
When your not in the mood????????❤️
Visit https://t.co/BFa9WMCoedpic.twitter.com/kGUODoMENh— Auto Forward (@autoforward1) April 1, 2022