Maha Shivratri : మహాశివరాత్రి లోపు ఈ 6 వస్తువుల్లో ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా వద్దన్నా డబ్బే డబ్బు వస్తుంది
Maha Shivratri : ఫిబ్రవరి 18న మహాశివరాత్రి అని తెలుసు కదా. మహాశివరాత్రి లోపు మీ ఇంటికి ఈ ఆరు వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్నా మీ ఇంటికి వద్దన్నా సరే ఐశ్వర్యం వస్తుంది. ఇంతకీ ఆ ఆరు వస్తువులు ఏంటి అనే ప్రశ్న మీకు తొలుస్తోంది కదా. పదండి.. ఆ ఆరు వస్తువులు ఏంటో తెలుసుకుందాం. వెంటనే వాటిని మీరు మహాశివరాత్రి లోపు తెచ్చుకుంటే మీ ఇంట్లో డబ్బే డబ్బు. శివరాత్రి అంటేనే చాలా గొప్పది. మహాశివరాత్రి లోపు పరమశివుడికి ఇష్టమైనవే అవి.
అభిషేక ప్రియుడికి శివరాత్రి రోజు జాగారం చేసి ఉదయమే శివాలయానికి వెళ్లి అభిషేకం చేసి దక్షణామృత శంఖాన్ని ఇంటికి తెచ్చి పెట్టకోవాలి. ఈ శంఖం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీదేవి ఈ ఇంట్లో ఉంటుంది. మన జీవితాలు సుఖసంతోషాలతో ఉంటాయి.డమరుకం కూడా ఇంట్లో పెట్టకోవాలి. డమరుకం ఇంట్లో ఉంటే ఆ శివుడి అనుగ్రహం కలుగుతుంది. మన పాపాలను హరిస్తుంది. మన ఇంట్లో ఉండే చెడు శక్తిని తొలగిస్తుంది.
Maha Shivratri : గోమాత బొమ్మ ఇంట్లో ఉండాలి
ఆ తర్వాత మన వేలు అంత పొడవు ఉన్న త్రిశూలాన్ని కూడా ఇంట్లో ఉంచుకోవాలి. ఆయన చేతుల్లో ఉండే త్రిశూలం.. మన సర్వపాపాలను తొలగిస్తుంది. ఆ తర్వాత గోమాత బొమ్మ కూడా మంచిది. గోమాత బొమ్మ తర్వాత లక్ష్మీ గవ్వలు కూడా తెచ్చుకోవాలి. ఆ తర్వాత గోమతి చక్రాలు, తామర గింజలు తెచ్చుకొని శివరాత్రి రోజు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే.. సర్వ పాపాలు తొలగిపోయి అఖండ ధనప్రాప్తిని, ఆ పరమ శివుడి అనుగ్రహాన్ని పొందొచ్చు.
