Christmas 2022 Festival : క్రిస్మస్ పండుగను ఈ వెరైటీ కేక్ తో సెలబ్రేట్ చేసుకోండి .. రుచి మాటల్లో చెప్పలేం ….!
Christmas 2022 Festival : ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గత కొన్ని లుగా మన ఇండియాలో కూడా క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రజలు ఇళ్లలో కాకుండా బయట పార్టీ లాగా చేసుకుంటున్నారు. ఈ పార్టీలలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి ఈ ప్రత్యేకమైన ఫుడ్స్ సర్వ్ చేసి ఈ క్రిస్మస్ ని ఇలా ఎంజాయ్ చేయండి. ఈ క్రిస్మస్ పండుగకు పిల్లలకు ఎంతో ఇష్టమైన క్రిస్మస్ కుకీలను తయారు చేయవచ్చు కరకరలాడే ఈ కుక్కిళ్లను అందరూ ఇష్టపడతారు.
పార్టీకి వచ్చే గెస్ట్ లకి ఈ కుకీలను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఇది ఒక రకాలుగా మార్కెట్లో దొరుకుతున్నాయి. అలాగే డిన్నర్ లో రోస్ట్ చేసిన చికెన్ సర్వ్ చేస్తే కంతో రుచిగా ఉంటుంది. కవిత అన్నింటికీ మించి క్రిస్మస్ పండుగకు కేక్ తప్పనిసరి. ప్లమ్ కేక్ లేకుండా క్రిస్మస్ పండుగ పూర్తయినట్లు కాదు.ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్లమ్ కేకులతో పండుగను జరుపుకుంటున్నారు. ఆన్‌లైన్లో కూడా ప్లమ్ కేక్స్ లభిస్తున్నాయి. లేదా ఇంట్లోనే కేక్ తయారుచేసుకోవచ్చు. ప్లమ్స్, డ్రైఫ్రూట్స్‌తో చేసే కేక్స్‌కి మంచి డిమాండ్ ఉంది.
తియ్యగా, క్రీమ్‌తో ఉండే పుడ్డింగ్ అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా పిల్లలు వీటిని అస్సలు వదిలిపెట్టరు. క్రిస్మస్ వేడుకల్లో పుడ్డింగ్స్ కూడా సర్వ్ చేయవచ్చు. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకుంటారు. ఈ పుడ్డింగ్‌ను ఇంట్లో చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. కొన్ని వందల రకాల పుడ్డింగ్స్ లభిస్తున్నాయి.చిన్న చిన్న కప్పుల్లో ఉండే కప్ కేక్ లను చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా ఇష్టం. క్రిస్మస్ సందర్భంగా వచ్చిన గెస్ట్ లకు కప్ కేక్‌లను సెర్వ్ చేస్తారు. మీరు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించవచ్చు.