Chanakya Niti : ఈ ఐదుగురిని నిద్ర నుంచి లేపారంటే… ప్రాణాలు పోయే అవకాశం ఉంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chanakya Niti : ఈ ఐదుగురిని నిద్ర నుంచి లేపారంటే… ప్రాణాలు పోయే అవకాశం ఉంది…

Chanakya Niti : ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాణక్యుడి విధానాలు ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకాలు. మంచి సురక్షితమైన జీవితాన్ని గడపడానికి చాణక్యుడు నీతి శాస్త్రంలో అనేక విషయాలను పేర్కొన్నారు. మంచి, చెడు మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. అయితే మనుషుల్లో ఒకరికి మరొకరు భిన్నంగా ఉంటారు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. అలాగే వ్యక్తుల నిద్ర గురించి కూడా చాణక్యుడు నీతి శాస్త్రంలో తెలిపారు. ఐదు రకాల వ్యక్తులను నిద్రలేపకూడదని చాణక్యుడు తెలిపారు. అలాంటివారు […]

 Authored By aruna | The Telugu News | Updated on :17 August 2022,7:00 am

Chanakya Niti : ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాణక్యుడి విధానాలు ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకాలు. మంచి సురక్షితమైన జీవితాన్ని గడపడానికి చాణక్యుడు నీతి శాస్త్రంలో అనేక విషయాలను పేర్కొన్నారు. మంచి, చెడు మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. అయితే మనుషుల్లో ఒకరికి మరొకరు భిన్నంగా ఉంటారు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. అలాగే వ్యక్తుల నిద్ర గురించి కూడా చాణక్యుడు నీతి శాస్త్రంలో తెలిపారు. ఐదు రకాల వ్యక్తులను నిద్రలేపకూడదని చాణక్యుడు తెలిపారు. అలాంటివారు నిద్రకు భంగం కలిగిస్తే ఇబ్బంది పడతారని ఒక్కో సందర్భంలో జీవితానికి హాని కలుగవచ్చని చెప్పారు.

1) ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం చిన్నపిల్లలను నిద్ర మధ్యలో లేపకూడదు. పిల్లలు అసంపూర్ణమైన నిద్రలో లేపితే చిరాకు పడతారు. దాంతో వారు రచ్చ రచ్చ చేస్తారు. వారిని ఆపడం చాలా కష్టమవుతుంది. అందుకే పిల్లలను నిద్ర మధ్యలో లేపకూడదు. అది వారి ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. 2) పురాతన కాలంలో రాజు నిద్ర లేపడం పెద్ద సాహసమే. అంతే కాదు నేరంగా కూడా పరిగణించేవారు. ఇక ప్రస్తుతం కాలంలోకి వస్తే పై అధికారిని పాలకుడు నిద్రలేపితే వారి కోపానికి గురికావడం తప్పదు.

Chanakya Niti don't disturb five person from sleep harmful

Chanakya Niti don’t disturb five person from sleep harmful

3) నిద్రపోతున్న సింహాన్ని లేపడం అంతా ప్రమాదకరం మరొకటి ఉండదు. ఇలాంటి తప్పులు ఎవరు చేయుదు. నిద్ర వస్తున్న సింహాన్ని లేపితే అది మిమ్మల్ని బక్షిస్తుంది. ప్రాణాలే పోతాయి. 4) ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం మూర్ఖుడిని నిద్ర లేపడం అంటే ఇబ్బందులకు ఆహ్వానించడం. మూర్ఖుడు ఎవరి మాట వినడు. అలాంటి వారిని నిద్రలేపితే హాని తలపెట్టే ప్రమాదం ఉంది. 5) ప్రమాదకరమైన మదమెక్కిన జంతువు నిద్ర పోతున్నప్పుడు మేలుకొలపడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవద్దు. ఇది కోపంతో దాడి చేస్తే ప్రాణాలే పోతాయి. అపరిచిత కుక్కను నిద్ర లేపడం కూడా ప్రమాదమే.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది