Chanakya Niti : మీలో తప్పులు ఉంటే ఇప్పుడే చక్కదిద్దుకోండి… లేదంటే తప్పవు కష్టాలు.
Chanakya Niti : మీలో తప్పులు ఉంటే ఇప్పుడే చక్కదిద్దుకోండి… లేదంటే తప్పవు కష్టాలు. ఎవరికైనా వారి మంచి ఆలోచనలు వారి కష్టం వారిని అందలానికి ఎక్కిస్తుంది. అలాగే వ్యక్తిలోని తప్పులు అతనిని ఓటమికి కారణమవుతుంది. చాణిక్య చెప్పిన కొన్ని సూత్ర విధానాల్లో , సుఖవంతమైన, మనశ్శాంతి తో ఎలా జీవించాలో తెలిపారు. కొన్ని ప్రత్యేకమైన విషయాలలో, ఇబ్బందులను, ఎలా ఎదుర్కోవాలో కూడా తెలిపారు. చాణిక్య చెప్పిన సూత్రాలలో మనిషి ఎదుగుదల సంతోషకరమైన జీవనం, అలాగే సంపద ఇలాంటి వాటిలో విజయాన్ని ఎలా అందుకోవాలో, అనే కొన్ని విధానాలను తెలిపారు. చాణిక్య చెప్పిన విధంగా వ్యక్తి మనసు అదుపులో ఉంచుకోలేనివాడు ఎప్పుడు సుఖంగా ఉండలేడు. ఆ వ్యక్తి దగ్గర అన్ని ఉన్న ఇంకా కావాలి. అనే మనస్తత్వం తనని సమస్యలోకి నేడుతుంది. అందుకోసమే మనిషికి తృప్తి అనేది కావాలి.
అలాగే డబ్బు: డబ్బు వచ్చినంత వరకే చాలు అనుకోవాలి. ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి. లేదు నాకు సరిపోదు, అనుకుంటే, తప్పుడు దారిలో నడవాల్సి వస్తుంది. అలా నడిచినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అందుకోసమే ఆశను అదుపులో ఉంచుకోవాలి. అలాగే సంతోషం: సుఖవంతమైన జీవితం ఎక్కడుంటుంది. వ్యక్తి చాలు అని ఎప్పుడు అనుకుంటాడో, అప్పుడే సంతోషకరమైన జీవితం దక్కుతుంది. చాలు అనుకున్నప్పుడే అందరితో ఉండగలవు సంతోషంగా ఉండగలవు, లేదు అంటే నీకు, మీ కుటుంబ సభ్యులకు కష్టాలు తప్పవు.
అలాగే విజయం: విజయం అందుకోవాలి అంటే మంచి మనసు మంచి ఆలోచన దానికి తోడు కష్టం ఉండాలి. అప్పుడే విజయం నీ వెన్ను వెంటే ఉంటుంది. లేదు కష్టపడకుండా విజయాలు అందాలి. అంటే ఆ విజయం ఎక్కువ కాలం నిలవదు, కాబట్టి మీరు నడిచేటప్పుడు మంచిదారిని ఎంచుకోవాలి. అలాగే మంచి మనసు ఉండాలి. అదేవిధంగా మనిషికి తృప్తి ఉండాలి. అతి ఆశ ఉండకూడదు. ఇలాంటి తప్పులు ఉంటే ఇప్పుడే సరిదిద్దుకోండి. లేదంటే అన్ని అపజయాలు, కష్టాలు తప్పవు.