Chanakya Niti : మీరు చేస్తున్న పనులలో విజయం మీ సొంతం కావాలంటే… ఈ నాలుగు పొరపాట్లు చేయవద్దు… అంటున్న చాణిక్య
Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు జీవితానికి సంబంధించి కొన్ని సూత్రాలను ఆయన చెప్పడం జరిగింది. జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అనుకోకుండా కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటివన్నీ మీ జీవితంలో విజయాలకు అడ్డుపడుతూ ఉంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ నాలుగు పొరపాట్లని చేయకండి.
1వది ఎవరైనా ఏదైనా పనిని తలపెట్టినప్పుడు మీ శక్తి సామర్థ్యాలను చూసుకున్న తర్వాతనే ఆ పనిని మొదలుపెట్టాలి. నేను ఎందుకు ఈ పనిని తల పెట్టాను. నేను దీనిని సాధించగలనా, అని మీ ఆత్మను ఒకటికి పది సార్లు పరిశీలన చేసుకోండి. మీకు ఇది సరైనది అని అనిపిస్తే అప్పుడు ఆ పనిని చేయండి. అప్పుడే మీరు విజయాలని అందుకోగలరు.
2వది మీరు చేసే పనిని చేస్తూ చేస్తూ సగంలో ఆపి వేస్తూ ఉంటారు. మీరు ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాత అది ఎంత కష్టమంతంగా ఉన్న కూడా దానిని ఆపకండి. దానిని ఎలాగైనా సాధించండి. ఇక నావల్ల కాదు అని ఎప్పుడూ అనుకోవద్దు. అలా చేయడం వలన మీ మీద మీరే నమ్మకం కోల్పోతారు. మనిషికి సహనం చాలా ముఖ్యమైనది, అది ఉంటే ఎలాంటి వాటిలోనైనా విజయాలను అందుకోవచ్చు. సహనం ఉండడం వలన అన్నిటికి సమాధానం దొరుకుతుంది.
3వది మీరు ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. దేనినైనా చూసి భయపడవద్దు. అలా భయపడటం వలన మీరు ఏ పనిని చేయలేరు. అలాగే భయపడుతూ చేసే పని ఇప్పుడైనా సక్సెస్ను ఇవ్వదు.
4వది మీరు ఏదైనా పని కోసం కొన్ని ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్లాన్లను మీరు ఎదుటివారితో అస్సలు పంచుకోవద్దు. అలా పంచుకోవడం వలన వారు మీ ప్లాన్ ని వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి తప్పులు అస్సలు చేయవద్దు.