Chanakya Niti : కాకి నుండి ఈ 4 విషయాలను నేర్చుకోగలిగితే.. మీకు జీవితంలో ఇక తిరుగు ఉండదు
Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు జీవితంలో ఎలా ఉండాలి. మనుషులతో ఎలా మెలగాలి. చేసే పనులలో ఎలా విజయాలను సాధించాలి. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇలా ఎన్నో సూత్రాలను మనిషి జీవితానికి సంబంధించినవి చెప్పాడు. అదేవిధంగా పక్షులతో ఎలా ఉండాలి. పక్షులు ఎలా ఉంటాయి. వాటిని చూసి ఏం నేర్చుకోవాలి. కూడా మనకి తెలియజేశారు. మానవుడు చాణిక్య చెప్పిన కొన్ని సూత్రాలను పాటిస్తే.. విజయాలకు ఎదురుగా వెళ్లగలరు అని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని పక్షులకు ఉన్న లక్షణాలను చూసి నేర్చుకుంటే జీవితంలో ఇక తిరుగు ఉండదు. అని కూడా ఆయన తెలియజేశారు. అలాంటి పక్షులలో ఒకటి కాకి ఈ కాకి లక్షణాలు ఏంటి.? వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం.
కాకి తన నివాసం పట్ల ,ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా మనిషి కూడా తన జీవితం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండగలిగితే… జీవితంలో కష్టాలకు దూరంగా ఉండొచ్చు. అని అంటున్న చాణక్య.
అదేవిధంగా కాకి తన ప్రవర్తన చాలా మొండిగా ఉంటుంది. అంటే ఏదైనా పని తలపెట్టింది. అంటే అది అయ్యేవరకు వదలదు. అదేవిధంగా మనిషి కూడా తన కెరీర్లో తనని తాను స్ట్రాంగ్ గా చేసుకొని విజయాలను సాధించడానికి సిద్ధంగా ఉండాలి. అని చాణిక్య తెలియజేస్తున్నారు. అలాగే కాకి తొందరగా దేనిని నమ్మదు. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించుకున్న తర్వాతే నమ్ముతుంది. అలాగే మనిషి కూడా ఎవరిని కూడా తొందరగా నమ్మవద్దు.
ఇలా తొందరగా నమ్మడం వలన కొన్ని ఇబ్బందులకి గురవుతారు. కాబట్టి అన్ని తెలుసుకున్న తర్వాతనే వారిని నమ్మాలి. అని అంటున్నారు. అలాగే కాకి ముందు జాగ్రత్తలు బాగా తీసుకుంటుంది. ఎప్పటికో ముందే తన వస్తువులను తెచ్చి తన గూట్లో పెట్టుకుంటూ ఉంటుంది. అంటే ఒక్కొక్క టైంలో వస్తువులు కానీ ,ఆహారం కానీ దొరకని సమయంలో వాటిని వాడుకుంటుంది. అంటే ముందుగానే జాగ్రత్త పడుతుంది. అలాగే మనిషి కూడా ముందుగానే అప్రమత్తంగా ఉండి సమయ అనుసారాలతో జీవితంలో ఏదైనా ముందుగానే చేసుకోవడం వలన ఆ జీవితానికి ఇక తిరుగు ఉండదు. అని తెలియజేస్తున్నారు చాణిక్య.
అదేవిధంగా కాకి ఎప్పుడూ ఎటువైపు నుంచి ఎలాంటి ఆపద వస్తుందో అని ముందుగానే పసికట్టగలదట. తనకి కొన్ని సంఘటనలు గురించి ముందుగానే తెలిసి పోతుందట. అలాగే మనిషి కూడా ఎప్పుడూ జాగ్రత్తతో అప్రమత్తంగా మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని గమనిస్తూ ఉండాలి. అలా అప్రమత్తంగా ఉండడం వలన కొన్ని కొత్త విషయాలను తెలుసుకున్న వారవుతారు. జీవితంలో ముందుకు సాగిపోతారు. ఇలా కాకి లో ఉండే లక్షణాలను నేర్చుకుంటే.. ఇక మనిషి జీవితానికి తిరుగు ఉండదు. అని అంటున్న చాణిక్య.