Chanakya Niti : తల్లిదండ్రుల్లో ఇటువంటి లక్షణాలుంటే ఇక వారి పిల్లల గతి అంతేనట..
Chanakya Niti : పిల్లల పెంపకం.. అదో ఆర్ట్.. అని చాలా మంది చెబుతారు. చాలా మందికి పిల్లలను ఎలా పెంచాలో సరిగ్గా తెలియక పొరపాట్లు చేస్తుంటారు. అటువంటి వారి కోసం పిల్లలను ఎలా పెంచాలో తెలియజేస్తూ చాణక్యుడు పలు గ్రంథాలను రాశాడు. పిల్లలకు అబద్దాలు ఆడించడం అస్సలు కే నేర్పించకూడదని ఆచార్య చాణక్యుడు బోధించాడు. అంతే కాకుండా మనం కూడా వారి ముందు అబద్దాలు ఆడకూడదని ఆయన తెలిపాడు. మనం ఇలా చేయడం వలన వారు కూడా అవే అబద్దాలను అలవాటుగా మార్చుకుంటారని హెచ్చరించాడు.
ఈ అలవాటు వలన వారు భవిష్యత్తులో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపాడు. వారికి ఉన్నతమైన విలువలను నేర్పించాలని చెప్పాడు. ఎవరైతే పిల్లల విద్య మీద సరైన శ్రద్ధ పెడతారో అటువంటి తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారని ఆయన తెలిపాడు. చిన్నప్పటి నుంచి సన్మార్గంలో నడిచిన పిల్లలు తమ తల్లిండ్రుల పేరును, కుటుంబం పేరును ప్రకాశింపజేస్తారని చాణక్యుడు వివరించాడు. ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లల చదువును సీరియస్ గా తీసుకోరో వారు తమ బిడ్డకు శత్రువు వంటి వారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
చదువుకోకుండా నిరక్ష్యరాస్యులుగా ఉన్న పిల్లలు నాగరిక సమాజం చేత తృణీకరించబడతారని అటువంటి వారికి భవిష్యత్తు ఉండదని చాణక్యుడు తెలిపాడు. అటువంటి చదువు రాని పిల్లలు హంసల మందలో కొంగ వలె ఉంటారని ఆయన పేర్కొన్నాడు. చదువు రాకపోతే సమాజం పిల్లల్ని గుర్తించదని ఆయన ఆనాడే చదువు విలువను చాటి చెప్పాడు. ఇక ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లలతో మితిమీరిన ప్రేమాభిమానాలతో ఉంటారో వారు తమ పిల్లలను స్వయంగా చెడ గొట్టిన వారవుతారని చాణక్యుడు తెలిపాడు. మితిమీరిన ప్రేమతో ఉండడం వలన పిల్లలు మొండిగా తయారయ్యే ప్రమాదం ఉందని చాణక్యుడు నమ్మాడు. అందుకోసమే పిల్లలతో అతి గారాబం చేయొద్దని అతడు సూచించాడు.