Chanakya Niti : ఈ విషయాలకు దూరంగా ఉండాలి.. లేదంటే భారీ నష్టం కలగొచ్చు అంటున్న చాణక్య.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakya Niti : ఈ విషయాలకు దూరంగా ఉండాలి.. లేదంటే భారీ నష్టం కలగొచ్చు అంటున్న చాణక్య..

 Authored By aruna | The Telugu News | Updated on :11 August 2022,6:00 am

Chanakya Niti : ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికే ఎంతోమంది అనుసరిస్తున్నారు. ఒక మనిషి ఎటువంటి మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి, అలాగే వ్యక్తి జీవితంలో పాటించాల్సిన అనేక నియమాలను ఈ నీతి శాస్త్రంలో ప్రస్తావించారు. వీటిని కనుక పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు. అయితే ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో ముఖ్యంగా ఇలాంటి విషయాలలో దూరంగా ఉండాలని ప్రస్తావించారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1) అహంకారం మనిషికి ఉండకూడదు. అలాంటివారు ఎప్పుడు జీవితంలో ఎదగలేరు. ఎప్పుడు ఇబ్బందుల్లోనే ఉంటారు. వారి అహంకారం వల్ల ప్రతీది కోల్పోతారు. అహం ఒక వ్యక్తిని సత్యానికి దూరంగా ఉంచుతుంది. అందుకే తనను తాను అర్థం చేసుకోలేడు. వీరి అహం కారణంగా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక మనిషి అహాన్ని వీడాలి. అప్పుడే జీవితం సుఖమయం అవుతుంది. 2) ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం సోమరితనం ఒక వ్యక్తి ప్రతిభను నాశనం చేస్తుంది. సోమరితనం కారణంగా అనేక అవకాశాలను కోల్పోతాడు. సోమరితనం తన లక్ష్యానికి దూరం చేస్తుంది. ఇలాంటి వారు జీవితంలో ఏమి సాధించలేరు. కనుక సోమరితనంతో ఎప్పుడూ ఉండకూడదు.

Chanakya Niti says that keep distance these 4 things

Chanakya Niti says that keep distance these 4 things

3) ఒక వ్యక్తికి కోపం అనేది అత్యంత ఘోరమైన శత్రువు. మనిషి కోపంతో తనపై తాను నియంత్రణ కోల్పోతాడు. అలాంటి వారు ఎప్పటికీ గౌరవం పొందలేరు. ప్రతి ఒక్కరూ కోపంగా ఉన్నవారికి దూరం అవుతారు. అందుకే సాధ్యమైనంతవరకు కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. 4)ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఏ మనిషి గొప్పలకు పోయి అతిగా ప్రవర్తించవద్దు. సాధారణంగానే మనిషి ఎన్నో రకాల అబద్దాలను చెబుతాడు. ఎదుటి వ్యక్తి ముందు తానే గొప్ప అని నిరూపించుకోవడం కోసం అనేక కబుర్లు చెబుతారు. అయితే ఇది చివరికి ఇబ్బంది పాలు చేస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది