Chanakya Niti : మన శత్రువు ముందు ఈ తప్పులు అస్సలు చేయకూడదు అంటున్న చాణక్య…
Chanakya Niti : ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికి ఎంతోమంది అనుసరిస్తారు. ఈయన గొప్ప విద్యావేత్త. బుద్ధి బలం కలవాడు. ఒక రాజ్యాన్నే ఏలగల సమర్థుడు. ఈయన రచించిన నీతి శాస్త్రంలో ఒక మనిషి జీవితంలో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి. ఎటువంటి మార్గంలో వెళ్లాలి. విజయాలను పొందాలంటే ఏం చేయాలి. ఇలా మొదలగు ఎన్నో అంశాలను తన నీతి శాస్త్రంలో రచించాడు. చాణక్యుడు చేసిన సూచనలు, సలహాలు, సందేశాలు నేటికీ మార్గదర్శకమే. వాటిని పాటించడం ద్వారా జీవితంలో ఎంతటి విపత్కర పరిస్థితులను ఆయన ఎదుర్కోవచ్చు.
విజయంతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. అయితే ఆచార్య చాణుక్యుడు తన నీతి శాస్త్రంలో శత్రువులతో ఎలా వ్యవహరించాలి. వారి ముందు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే వివరాలను పేర్కొన్నారు. శత్రువుల ముందు ఆ తప్పులు చేస్తే పరిస్థితులు మారిపోయే ప్రమాదం ఉందని చాణక్యుడు హెచ్చరించారు. 1) ప్రతి మనిషికి తమ జీవితంలో ఎవరో ఒకరు శత్రువు ఉండే ఉంటారు. శత్రువును ఓడించిన తర్వాత సహనం కోల్పోకూడదు. బలహీనంగా ఉన్నారని అనుకోవాలి. ఒకవేళ ఓడిపోతే ఆ సందర్భంలో ప్రశాంతంగా ఉండాలి. ఓపిక పట్టాలి. ఎప్పుడు గెలవడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించాటానికి అస్సలు భయపడాల్సిన పనిలేదు. మానసికంగా శారీరకంగా బలంగా దృఢంగా ఉండాలి.
2) ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. తమ బలహీనతను ఇతరులకు అస్సలు చెప్పకూడదు. శత్రువు అయితే మరిచిపోయి కూడా వారికి మీ బలహీనతను అస్సలు తెలియనివ్వకూడదు. ఒకవేళ తెలిస్తే చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మన శత్రువుకి మన బలహీనత ఏంటో అసలు తెలియనివ్వకూడదు అని నీతి శాస్త్రంలో ఆచార్య చాణక్యుడు పేర్కొన్నారు. 3) ఒక మనిషి తన శత్రువును ఎప్పుడూ బలహీనంగా ఉన్నాడు అనుకోవద్దు. చాలా సందర్భాల్లో వ్యక్తులు తమ శత్రువులను బలహీనులుగా తమని తాము శక్తివంతులుగా భావించి తప్పుడు పనులు చేస్తారు. అలా చేయడం వలన శత్రువు విజయానికి కారణం అవుతారు. ఎక్కువగా ఆలోచించకుండా శత్రువు యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేయడం చాలా ముఖ్యం అని చాణక్యులు నీతి శాస్త్రంలో తెలిపారు.