Chanakya Niti : భార్య భర్తల మధ్య ప్రేమ కలకాలం ఉండాలంటే… వీటిని తప్పకుండా పాటించాలి అంటున్న చాణక్యులు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakya Niti : భార్య భర్తల మధ్య ప్రేమ కలకాలం ఉండాలంటే… వీటిని తప్పకుండా పాటించాలి అంటున్న చాణక్యులు…

 Authored By aruna | The Telugu News | Updated on :21 September 2022,6:00 am

Chanakya Niti : ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన గొప్ప విద్యావేత్త, బుద్ధి బలం కలవాడు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికి ఎంతోమంది అనుసరిస్తున్నారు. ఒక మనిషి జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి ఇలా మొదలగు విషయాలను చాణుక్యుడు నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఈ నీతి శాస్త్రంలో భార్యాభర్తలు కలకాలం ప్రేమగా సంతోషంగా ఉండాలంటే ఈ విషయాలను పాటించాలి అని చాణుక్యలు పేర్కొన్నారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1) భార్య భర్తల సంబంధంలో సందేహాలు అనేవి ఉండకూడదు. ఎప్పుడు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఇద్దరి మధ్య సందేహాలు ఉంటే ఆ సంబంధం నాశనం అవుతుంది. కనుక భాగస్వామిని ఎప్పుడు అవమానించకూడదు. మీ భాగస్వామి గురించి ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే అడగడం ద్వారా సందేహాలు ఆలోచనలను దూరం చేసుకోవచ్చు. 2) ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం భార్యాభర్తల సంబంధంలో అహంకారం అనేది ఉండకూడదు. ఇది మీ సంబంధంలో వివాదాలకు కారణం కావచ్చు. అహంకారం వలన భాగస్వామి నుండి దూరం చేస్తుంది. కాబట్టి అహంకారానికి దూరంగా ఉండాలి.

Chanakya Niti spiritual speech about wife and husband relation

Chanakya Niti spiritual speech about wife and husband relation

3) భార్య భర్తల ప్రేమలో ఎటువంటి మోసం ఉండకూడదు. ప్రేమను జీవిత భాగస్వామికి తెలియజేయడం ఏకైక మార్గం స్వచ్ఛత అని చాణక్యుడు తెలియజేశారు. మనిషి స్వార్థం కంటే ప్రేమకు లొంగిపోతాడు. 4) భార్యాభర్తల సంబంధం లో ఒకరినొకరు స్వేచ్ఛను ఇచ్చుకోవాలి. చిన్న చిన్న విషయాలకు ఒకరినొకరు నిదించుకోకూడదు. ఇలా చేయడం వలన సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ఉండాలి. అప్పుడే భార్యాభర్తల మధ్య ప్రేమ కలకాలం ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది