Chanakya Niti : ఇలాంటి స్త్రీ భాగస్వామిగా వస్తే ఏమవుతుందో తెలుసా…? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chanakya Niti : ఇలాంటి స్త్రీ భాగస్వామిగా వస్తే ఏమవుతుందో తెలుసా…?

Chanakya Niti : ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికీ ఎంతోమంది అనుసరిస్తున్నారు.ఈ నీతి శాస్త్రంలోఒక మనిషి తన జీవితంలో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి, ఎటువంటి మార్గంలో వెళ్లాలి అనేది ఉంటుంది. భార్య గుణగణాలకు సంబంధించి అనేక కీలక వివరాలను పేర్కొన్నారు. భార్య భర్తతో ఎప్పుడు నిజమే మాట్లాడుతూ, ధర్మాన్ని అనుసరిస్తూ, భర్తను గౌరవించి, ప్రేమించి, అతని సుఖదుఃఖాలలో పాలు పంచుకోవడానికి సిద్ధపడగలిగేలా ఉండాలి. అదృష్టం వల్లనే ఎవరికైనా ఇలాంటి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 July 2022,4:00 pm

Chanakya Niti : ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికీ ఎంతోమంది అనుసరిస్తున్నారు.ఈ నీతి శాస్త్రంలోఒక మనిషి తన జీవితంలో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి, ఎటువంటి మార్గంలో వెళ్లాలి అనేది ఉంటుంది. భార్య గుణగణాలకు సంబంధించి అనేక కీలక వివరాలను పేర్కొన్నారు. భార్య భర్తతో ఎప్పుడు నిజమే మాట్లాడుతూ, ధర్మాన్ని అనుసరిస్తూ, భర్తను గౌరవించి, ప్రేమించి, అతని సుఖదుఃఖాలలో పాలు పంచుకోవడానికి సిద్ధపడగలిగేలా ఉండాలి. అదృష్టం వల్లనే ఎవరికైనా ఇలాంటి స్త్రీ భార్యగా లభిస్తుంది. అలాంటి స్త్రీ భాగస్వామిగా వస్తే భర్త వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూ, ప్రేమను పంచాలి.

1) భార్య కష్టాలు రాకుండా ఉండేందుకు డబ్బును ఆదా చేయాలి. అయితే భార్యకు కష్టం వస్తే రక్షించే విషయంలో మాత్రం డబ్బు గురించి అస్సలు ఆలోచించొద్దని ఆచార్య చాణక్య చెప్పారు. అయితే ఆత్మగౌరవం విషయానికి వస్తే డబ్బు, భార్య రెండింటిని త్యాగం చేయాలి. ఆ సమయంలో ఆలోచించాల్సిన అవసరం లేదని ఆచార్య చాణక్యుడు తెలిపారు.

Chanakya Niti spiritual speech about wife

Chanakya Niti spiritual speech about wife

2)భార్య సామాన్యమైనదైన, రూపవతి అయిన, చదువుకున్నదైన, నిరక్షరాస్యులైన, సంస్కారవంతురాలై కుటుంబాన్ని చక్కగా నిర్వహించగల సామర్థ్యం ఉన్నదై ఉండాలి. అలాంటి భార్యను భర్త ఎల్లప్పుడూ గౌరవించాలి. అలాగే ఆమెతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని ఆచార్య తెలిపారు. భార్య స్వరూపం కంటే ఆమె లక్షణాలు చాలా ముఖ్యమైనవని తెలిపారు.

3) మీ భాగస్వామి ఎంత నమ్మదగినది అని మీరు తెలుసుకోవాలంటే చాలా నమ్మకమైన పనిని ఆమెకు అప్పగించాలి. ఇలా చేస్తే అది వారి ఉద్దేశాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా మీ వద్ద డబ్బు, కీర్తి లేనప్పుడు కూడా మీ భార్యను పరీక్షించటం ద్వారా ఆమె నిజంగా మీ పట్ల అంకిత భావంతో ఉందో లేదో తెలుస్తుంది. ఇలాంటి స్త్రీ మీకు భార్యగా లభిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా మీ జీవితం సుఖంగా ఉంటుంది.

4) ఒక స్త్రీ ఇల్లు కట్టుకోగలదు, అలాగే నాశనం కూడా చేయగలదు అని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రం ద్వారా తెలిపారు. భార్య చెడు స్వభావం కలది అయితే ఆమెతో ఉండకపోవడమే మంచిది. అలాంటి భార్య మొత్తం కుటుంబాన్ని నాశనం చేయగలరు. అలాంటి వారితో కలిసి ఉంటే ఇంట్లో ఎప్పుడు సంతోషం, శాంతి ఉండదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది