Chanakya Niti : ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికీ ఎంతోమంది అనుసరిస్తున్నారు.ఈ నీతి శాస్త్రంలోఒక మనిషి తన జీవితంలో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి, ఎటువంటి మార్గంలో వెళ్లాలి అనేది ఉంటుంది. భార్య గుణగణాలకు సంబంధించి అనేక కీలక వివరాలను పేర్కొన్నారు. భార్య భర్తతో ఎప్పుడు నిజమే మాట్లాడుతూ, ధర్మాన్ని అనుసరిస్తూ, భర్తను గౌరవించి, ప్రేమించి, అతని సుఖదుఃఖాలలో పాలు పంచుకోవడానికి సిద్ధపడగలిగేలా ఉండాలి. అదృష్టం వల్లనే ఎవరికైనా ఇలాంటి స్త్రీ భార్యగా లభిస్తుంది. అలాంటి స్త్రీ భాగస్వామిగా వస్తే భర్త వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూ, ప్రేమను పంచాలి.
1) భార్య కష్టాలు రాకుండా ఉండేందుకు డబ్బును ఆదా చేయాలి. అయితే భార్యకు కష్టం వస్తే రక్షించే విషయంలో మాత్రం డబ్బు గురించి అస్సలు ఆలోచించొద్దని ఆచార్య చాణక్య చెప్పారు. అయితే ఆత్మగౌరవం విషయానికి వస్తే డబ్బు, భార్య రెండింటిని త్యాగం చేయాలి. ఆ సమయంలో ఆలోచించాల్సిన అవసరం లేదని ఆచార్య చాణక్యుడు తెలిపారు.
2)భార్య సామాన్యమైనదైన, రూపవతి అయిన, చదువుకున్నదైన, నిరక్షరాస్యులైన, సంస్కారవంతురాలై కుటుంబాన్ని చక్కగా నిర్వహించగల సామర్థ్యం ఉన్నదై ఉండాలి. అలాంటి భార్యను భర్త ఎల్లప్పుడూ గౌరవించాలి. అలాగే ఆమెతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని ఆచార్య తెలిపారు. భార్య స్వరూపం కంటే ఆమె లక్షణాలు చాలా ముఖ్యమైనవని తెలిపారు.
3) మీ భాగస్వామి ఎంత నమ్మదగినది అని మీరు తెలుసుకోవాలంటే చాలా నమ్మకమైన పనిని ఆమెకు అప్పగించాలి. ఇలా చేస్తే అది వారి ఉద్దేశాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా మీ వద్ద డబ్బు, కీర్తి లేనప్పుడు కూడా మీ భార్యను పరీక్షించటం ద్వారా ఆమె నిజంగా మీ పట్ల అంకిత భావంతో ఉందో లేదో తెలుస్తుంది. ఇలాంటి స్త్రీ మీకు భార్యగా లభిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా మీ జీవితం సుఖంగా ఉంటుంది.
4) ఒక స్త్రీ ఇల్లు కట్టుకోగలదు, అలాగే నాశనం కూడా చేయగలదు అని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రం ద్వారా తెలిపారు. భార్య చెడు స్వభావం కలది అయితే ఆమెతో ఉండకపోవడమే మంచిది. అలాంటి భార్య మొత్తం కుటుంబాన్ని నాశనం చేయగలరు. అలాంటి వారితో కలిసి ఉంటే ఇంట్లో ఎప్పుడు సంతోషం, శాంతి ఉండదు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.