Chanakya Niti : ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండకపోతే.. మీ జీవితంలో వీటిని కోల్పోక తప్పదు…!
Chanakya Niti : సహాయం చేయడం అనేది ఒక పుణ్యకార్యంగా భావిస్తారు. అయితే ఇతరులకు సహాయం చేయడం అనేది ఆదర్శ వ్యక్తిత్వానికి సంకేతంగా చెబుతారు. ఇక కొన్నిసార్లు ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అలాంటి సమయంలో వారు మీ నిస్సహాయతను అర్థం చేసుకుంటారు. ఇక కొన్నిసార్లు మీ సహాయం ఇతరులకు ప్రయోజనం కల్పించేలా ఉండదు. ఇలాంటప్పుడు సహాయం చేసే ముందు వారి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలని ఆచార్య చాణిక్యుడు బోధించాడు. ప్రధానంగా మూడు […]
ప్రధానాంశాలు:
Chanakya Niti : ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండకపోతే.. మీ జీవితంలో వీటిని కోల్పోక తప్పదు...!
Chanakya Niti : సహాయం చేయడం అనేది ఒక పుణ్యకార్యంగా భావిస్తారు. అయితే ఇతరులకు సహాయం చేయడం అనేది ఆదర్శ వ్యక్తిత్వానికి సంకేతంగా చెబుతారు. ఇక కొన్నిసార్లు ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అలాంటి సమయంలో వారు మీ నిస్సహాయతను అర్థం చేసుకుంటారు. ఇక కొన్నిసార్లు మీ సహాయం ఇతరులకు ప్రయోజనం కల్పించేలా ఉండదు. ఇలాంటప్పుడు సహాయం చేసే ముందు వారి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలని ఆచార్య చాణిక్యుడు బోధించాడు. ప్రధానంగా మూడు రకాల వ్యక్తులకు సహాయం చేస్తే తాను కూర్చున్న కొమ్మును తాను నరుక్కున్నట్లు అవుతుందని చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. మరి ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Chanakya Niti : దుర్బుద్ధి – సంస్కారం లేని స్త్రీలకు సహాయం..
స్త్రీలలో మంచి వ్యక్తిత్వం లేని వారిని వివాహం చేసుకుంటే ఆ వైవాహిక జీవితం నాశనం అవుతుంది. కనుక అలాంటి స్త్రీలను వివాహం చేసుకోకూడదని చాణిక్యుడు చెప్పాడు. స్త్రీలకు దుర్బుద్ధి మంచి వ్యక్తిత్వం లేకపోతే భర్త కుటుంబ పురోగతికి ఆటంకాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇలాంటి వారికి జీవితంలో దూరంగా ఉండటమే మంచిది. ఇక జీవిత భాగస్వామిని తెలివిగా ఎన్నుకోవాలని చాణిక్యుడు సూచించాడు.
Chanakya Niti : మూర్ఖుడైన శిష్యుడు
చాణక్య నీతి ప్రకారం అజ్ఞాన శిష్యుడికి ఏ పాఠం కూడా అర్థం కాదు. వీరికి ఎంత వివరించిన ప్రయోజనం ఉండదు. కాబట్టి తెలివి తక్కువ విద్యార్థికి మీ సహాయాన్ని మరియు శక్తిని వృధా చేయడంలో ఎలాంటి అర్థం లేదు. ఇతరుల గురించి చింతించకండి. ఎందుకంటే అలాంటి వారి కోసం మీ సమయాన్ని వృధా చెయ్యకండి అని చాణక్యుడు వివరించాడు. ముఖ్యంగా అలాంటి వారికి దూరంగా ఉండాలంటూ చానిక్యుడు బోధించాడు.
అనారోగ్యం భారీ పడిన వ్యక్తి : అనారోగ్య భారీ పడిన వ్యక్తి వ్యక్తి ప్రతికూల శక్తినీ ప్రసరింపజేస్తాడు. అలాగే అతను ఎప్పుడూ కూడా విచారంగా ఉంటాడు. అంతేకాకుండా వారు మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వరు. అందుకే అనారోగ్యంతో ఉన్నవారికి వీలైనంత దూరంగా ఉండాలని చాణిక్యుడు చెప్పాడు.
ఈ ముగ్గురు వ్యక్తులకు దూరంగా ఉండటమే కాకుండా నిర్దిష్ట లక్షణాలు ఉన్న ఇతర వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. అంటే హాని , ఓర్వలేనివారు , దుర్బుద్ధి గలవారు , భయంతో ఉండేవారు , అసూయతో బాధపడేవారు మరియు పిరికివారు ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరం పాటించాలని ఆచార చాణిక్యుడు సూచించాడు. అదేవిధంగా జీవితంలో ఎదగడానికి అబద్ధాలు చెప్పడం, స్వార్థపరులకు, మద్యం సేవించే వారికి, అత్యాశపరులకు దూరంగా ఉండడం మంచిదని నీతి శాస్త్రంలో చాణక్యుడు బోధించాడు.