Chanakya Niti : చాణిక్య ఇలాంటి ప్రదేశాలలో ఉండడం వల్ల ఎలాంటి వారికైనా తప్పవు తిప్పలు…
Chanakya Niti : చాణక్యని తన నీతి శాస్త్రంలో చాణిక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈయన చెప్పిన నీతులు మానవ జీవితంలో ఎలా ఉండాలి. అలాగే ఎలాంటి పనులు చేయాలి. ఇంటి గురించి, ఇంట్లో ఉన్న వస్తువులు గురించి, ఇలా ఎన్నో నీతులు చెప్పాడు. ఆయన చెప్పిన నీతులు ప్రతి ఒక్కరూ పాటిస్తే జీవితం విజయవంతంగా సాగిపోతుంది. గౌరవం పొందని ప్రదేశం.. మానవుడు పలుచోట్ల ఉండడంవల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత బాధపడిన ఉపయోగ ఉండదు. అని చాణిక్య చెప్పారు.
కొందరి మధ్యలో ఉన్నప్పుడు మనుషులను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆగౌరవంగా చూస్తూ ఉంటారు. అలాంటి చోటులో ఉండడం. వలన మనుషుల విలువలు తగ్గిపోతాయి. కాబట్టి అలాంటి వారి మధ్యన ఉండకూడదు. చదువు లేని ప్రదేశం: విద్యకు విలువ లేని చోట కూడా ఉండవద్దు. అని చాణిక్య తెలిపారు. అలాంటి ప్రదేశంలో ఉండడం వలన పిల్లల భవిష్యత్తుకు భంగం కలుగుతుంది. అలాగే వారి జీవితం చీకటమయం అవుతుంది. సన్నిహితులు, బంధువులు లేని ప్రదేశం: ఎలాంటి వారికైనా సన్నిహితులు, బంధువులు అనే వ్యక్తులు చాలా అవసరం అలాంటి బంధాలు లేని చోట జీవించకూడదు.
అలాంటి ప్రదేశాన్ని వదిలి వెంటనే వెళ్లాలి. ఎందుకంటే మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఎవరు మీకు సహాయం చేయరు కాబట్టి. అలాంటి చోట ఉండకూడదు. అలాగే పని లేని ప్రదేశం: ఎలాంటి వారైనా పనిలేని చోట అస్సలు ఉండకూడదు. అలాంటి చోట ఉండడం వలన లాభం ఉండదు. పని లేకపోతే ధనం ఉండదు. ధనం లేకపోతే జీవనం సాగించటం కష్టమవుతుంది. ఎవరైనా పనిలేని చోట్లో జీవించకూడదు. ఇవన్నీ చాణిక్య చెప్పిన నీతులు: ఆయన చెప్పిన సూత్రాలు అన్ని పాటిస్తే, మన జీవితం సుఖ, సంతోషాలతో గడపవచ్చు.