Chanakya Niti : మానవ జీవితంలో ఈ 5 పాఠాలను పాటిస్తే.. మోసం అన్నది మీ దరిదపుల్లోకి కూడా రాదట.. చాణక్య నీతి
Chanakya Niti : మన భారత దేశ చరిత్రలు చాణక్యుడు ఒకడు. ఈయన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడు. చాలా రకాల వేదాలను చదివిన వ్యక్తి ఈ చాణిక్యుడి కి రాజనీతి అంటే చాలా ఇష్టమట. ఈయన మంత్రిగా చేస్తున్న సమయంలో ఈ రెండు పుస్తకాలను కూడా రచించారు అవే చాణక్య నీతి, అర్థశాస్త్రం. ఈ గ్రంథాలు ఇప్పుడు నేటి పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విజయాలను సాధించడం ఎలా, అనుకున్న దాన్ని దక్కించుకోవడం ఎలా వంటి అంశాల గురించి ఈ గ్రంథంలో రాశారట.మనం ఏ పని చేయడానికి ముందు అయినా ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలి అని చాణిక్యుడు తెలుపుతున్నాడు. అవి ఎందుకు ఈ పని చేస్తున్నాను?, దీని వల్ల ఫలితం ఏంటి?, ఇందులో విజయం సాధించగలనా? అన్న ఈ మూడు ప్రశ్నలను మనం ఎప్పుడూ అనుసరించడం వల్ల మనకు విజయం దక్కుతుంది.
ఎవరి చేతిలోనూ కూడా మోసపోము అని చాణక్యుడి సిద్ధాంతం చెబుతుంది. విద్య అనేది మనిషికి ఒక మంచి స్నేహితుడుల పనికి వస్తుందని చాణక్యుడు చెప్తున్నాడు. అయితే ఈ ఐదు పాఠాలు నేర్చుకోవడం వల్ల విజయాన్ని మన సొంతం చేసుకోవచ్చు. చెడు ఉద్దేశాలు కలిగిన భార్య, స్నేహితుడు, బంధువులు ఎవరైనా సరే వారిని మనకి దూరంగా ఉంచటమే మంచిది వీరి చెడు ఉద్దేశాల కారణంగా ఒక్కోసారి మనకు ప్రాణాంతకం కూడా కావచ్చు.చాణక్యుడు తెలుపుతున్న దాని ప్రకారం చూస్తే ఎప్పుడూ కూడా మన మంచి కొరని కత్తులతో సావాసం ఎక్కువ రోజులు మంచిది కాదు అంటున్నారు. ప్రతి వ్యక్తి తమ జీవితంలో సంపదను కూడబెట్టడం చాలా అవసరం. ఎందుకంటే ఎవరో మనకు తోడు లేని సమయంలో ఈ డబ్బు మనకు ఉపయోగపడుతుంది.
Chanakya Niti : అలాంటి వారితో స్నేహం మంచిదికాదు..
ప్రతి వ్యక్తిని పరీక్షించడం చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్తున్నారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన బంధువులను,స్నేహితులనుమనకు మంచి సమయం లేనప్పుడు భార్యను లేదా భర్తను పరీక్షించడం చాలా ముఖ్యం దీని కారణంగానే మనతో మన కష్టాల్లో ఎవరు మనకు తోడుగా ఉంటారో తెలుస్తుంది.చెడు నడవడికలు కలిగిన వ్యక్తులకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇలా దూరంగా ఉండడం వల్ల వీరి నుంచి వచ్చే సమస్యల నుంచి మనం బయట పడగలము. ఉపాధి లేనిచోట ఎవరికీ తల వంచ కూడదు, సిగ్గు పడకూడదు. మతం మీద మక్కువ ఎక్కువ ఉన్నవారి మధ్య మతం మీద నమ్మకం లేని వారు ఉండకూడదు ఇలాంటి వారే మతం మీద నమ్మకం లేకుండా ప్రజలకు సహాయపడగలరు