Chandra Dosham : చంద్ర దోష నివారణకు ఈ పరిహారాలు తప్పక పాటించండి… సనాతన ధర్మం ఏం చెబుతుందంటే…!
Chandra Dosham : హిందూ మతంలో ఏడు రోజులు ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అయితే సోమవారం రోజు శివుడిని పూజిస్తారు. సోమవారం శివుడిని పూజించడంతో పాటు ప్రసనం చేసుకోవడానికి ఉపవాసాలు కూడా ఉంటారు. అయితే ఈ రోజున శివుడి ఆశీర్వాదాలు పొందుతే జీవితంలో అదృష్టం లభిస్తుందని అలాగే బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శివుడు సృష్టి లయకారుడు కాబట్టి సనాతన ధర్మంలో శివుడు సృష్టి, స్థితి, ప్రళయరూపం అనే మూడు కారణాలకు శివుడే […]
ప్రధానాంశాలు:
Chandra Dosham : చంద్ర దోష నివారణకు ఈ పరిహారాలు తప్పక పాటించండి... సనాతన ధర్మం ఏం చెబుతుందంటే...!
Chandra Dosham : హిందూ మతంలో ఏడు రోజులు ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అయితే సోమవారం రోజు శివుడిని పూజిస్తారు. సోమవారం శివుడిని పూజించడంతో పాటు ప్రసనం చేసుకోవడానికి ఉపవాసాలు కూడా ఉంటారు. అయితే ఈ రోజున శివుడి ఆశీర్వాదాలు పొందుతే జీవితంలో అదృష్టం లభిస్తుందని అలాగే బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శివుడు సృష్టి లయకారుడు కాబట్టి సనాతన ధర్మంలో శివుడు సృష్టి, స్థితి, ప్రళయరూపం అనే మూడు కారణాలకు శివుడే కారణం అని అంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే కష్ట నష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. ముఖ్యంగా జ్యోతిష్యంలో ఉండే చంద్ర దోష నివారణకు సోమవారం కొన్ని పూజా విధానాలను పాటించాలి. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Chandra Dosham సోమవారం శివుడికి పూజ చేసే విధానం.
సోమవారం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తల స్నానం చేయాలి. ఆ తరువాత తెల్లటి దుస్తులను ధరించాలి. నియమానుసారం శివుడిని పూజించుకోవాలి. ఈ రోజున తెల్ల దుస్తులను దానం చేయడం వలన జన్మ నక్షత్రంలో ఉండే చంద్రుడి స్థానం బలపడుతుంది.
అకాల మరణ భయం తొలగడానికి.
– హిందూ సాంప్రదాయాల ప్రకారం శివుడి అనుగ్రహం పొందడం కోసం సోమవారం రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వలన వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి.
– శివుడికి పూలు , పండ్లు స్వీట్లు సమర్పించిన తర్వాత ఆకు పచ్చటి దుప్పటిని పరిచి దాని మీద కూర్చోవాలి. ఆ తరువాత మీ ముఖాన్ని ఉత్తరం వైపు ఉంచి ” ఓం నమో భగవతే రాగ రుద్రాయ స్వాహా ” అనే మంత్రాన్ని 17 సార్లు జపమాల మంత్రాన్ని జపించండి.
– ఆ తరువాత నైవేద్యాలను సమర్పించి శివుడికి హారతి ఇవ్వాలి.
రుణ విముక్తికి శివారాధన.
– నందిపై అమర్చిన శివుని ప్రతిమను పూజించడం వలన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు.
-పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పూజ గదిలో ప్రతిష్టించండి.
– బోలాశంకరుడికి పండ్లు, పువ్వులు, స్వీట్లను సమర్పించండి. శివుడికి పూజలు చేయండి.
-ఎర్రటి దుప్పటి మీద కూర్చొని తూర్పు ముఖంగా “ఓం నమో భగవతే గంగ రుద్రాయ స్వాహా” ఈ మంత్రాన్ని 19 సార్లు జపించాలి.
– అనంతరం శివుడికి డ్రై ఫుడ్స్ లడ్డుని ప్రసాదంగా సమర్పించండి.
Chandra Dosham జ్ఞానం పొందడం కోసం
– జ్ఞానం పొందడం కోసం శివుని యోగేశ్వర్ రూపాన్ని ఆలయంలో ప్రతిష్టించి పంచోపచార పూజలు చేయాలి. ఆ తరువాత నీలిరంగు దుప్పటి మీద కూర్చుని ఉత్తరాభిముఖంగా ” ఓం నమో భగవతే వ్యాఘ్ర రుద్రాయ స్వాహా ” అనే మంత్రాని 11 సార్లు జపించండి.
– ఆ తరువాత శివుడికి బిల్వ పత్రాలు, మారేడు పండులను సమర్పించాలి.
– చివరిగా హారతి ఇచ్చి పూజని ముగించండి.
అదృష్టం కోసం.
– పూజా స్థలంలో క్రిస్టల్ శివలింగాన్ని ప్రతిష్టించండి.
-శివుడికి పండ్లు, పూలు, స్వీట్లను సమర్పించి శివుడిని పూజించాలి.
– ఎరుపు దుప్పటి మీద కూర్చొని మీ ముఖాన్ని ఉత్తరం వైపు ఉంచి ” ఓం నమో భగవతే వ్యోమ రుద్రాయ స్వాహా” అనే మంత్రాన్ని మంత్రాన్ని 7 సార్లు జపించండి.
-ముఖ్యంగా ఈ మంత్రాన్ని జపించేటప్పుడు జపమాలను కప్పి ఉంచి గుండెకు దగ్గరగా ఉంచుకోవాలి.
– ఆ తరువాత శివునికి బియ్యం పాయసాన్ని ప్రసాదంగా సమర్పించండి. చివరిగా శివుడికి హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా పార్థించండి.