Chandramangala Yoga : సెప్టెంబర్ నెలలో అరుదైన చంద్రమంగళ యోగం… ఈ రాశుల వారికి అధిక ధన లాభం…!
Chandramangala Yoga : హిందూమతంలో సమస్త విజ్ఞాలను తొలగించే విజ్ఞ రాజు వినాయకుని నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ నవరాత్రులలో ఒకరోజు అరుదైన చంద్రమంగళ యోగం ఏర్పడనుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరానున్నాయి. ఇక ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేపట్టిన సరే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయితే వాస్తవానికి గ్రహాల సంచారం వలన కలిగే యోగాల కారణంగా ప్రతి మనిషి జీవితంలో అనేక రకాల మార్పులు […]
ప్రధానాంశాలు:
Chandramangala Yoga : సెప్టెంబర్ నెలలో అరుదైన చంద్రమంగళ యోగం... ఈ రాశుల వారికి అధిక ధన లాభం...!
Chandramangala Yoga : హిందూమతంలో సమస్త విజ్ఞాలను తొలగించే విజ్ఞ రాజు వినాయకుని నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ నవరాత్రులలో ఒకరోజు అరుదైన చంద్రమంగళ యోగం ఏర్పడనుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరానున్నాయి. ఇక ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేపట్టిన సరే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయితే వాస్తవానికి గ్రహాల సంచారం వలన కలిగే యోగాల కారణంగా ప్రతి మనిషి జీవితంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఇప్పుడు ఏర్పడబోయే చంద్రమంగళ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అనేక రకాల శుభాలు కలుగుతాయి. మరి ఈ చంద్రమండల యోగం కారణంగా ఏఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Chandramangala Yoga మేషరాశి…
చంద్ర మంగళ యోగం కారణంగా మేష రాశి వారికి సెప్టెంబర్ నెల బాగా కలిసి వస్తుంది. ఈ నెలలో వీరికి లాటరీ తగిలే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో బాగా రానిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. డబ్బు దినాభివృద్ధి చెందుతుంది. సంపాదించిన సొమ్మును సక్రమ మార్గంలో వినియోగించుకోగలుగుతారు.
మీన రాశి..
మీన రాశి వారికి ఈ సమయంలో ఆగిపోయిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. అంతేకాక చేసే ప్రతి పని బాగా కలిసి వస్తుంది. న్యాయపరమైన విషయాల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా బలపడతారు.
కర్కాటకం…
చంద్రమంగళ యోగం కారణంగా కర్కాటక రాశి వారికి అన్ని శుభ ఫలితాలు పలుకుతాయి. గతంలో నిలిచిన పనులన్నీ ఈ సమయంలో సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రేమ విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మిధున రాశి…
చంద్రమంగళ యోగం కారణంగా మిధున రాశి వారికి భార్య తరఫునుంచి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఉద్యోగరంగంలో ఉన్నవారు ప్రమోషన్లు పొందుతారు. వ్యాపార రంగంలో పురోగతి సాధిస్తారు.