Daiva Pooja : దైవ పూజ, నియమాలు, దోష పరిహారాలు.. ఖాళీ కడుపుతో పూజ చేయడంలో ఉన్న గొప్ప రహస్యం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Daiva Pooja : దైవ పూజ, నియమాలు, దోష పరిహారాలు.. ఖాళీ కడుపుతో పూజ చేయడంలో ఉన్న గొప్ప రహస్యం…!

Daiva Pooja : హిందువులు, బౌద్ధులు, జైనులు దేవతలకు భక్తిశ్రద్ధలతో చేసే ప్రార్థన కూడా పూజ అనే అంటారు. చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం కోసం పూజలు చేస్తూ ఉంటారు. పూజ అనే సంస్కృత పదానికి గౌరవం, నివాళి. ఆరాధన అని అర్థాలు ఉన్నాయి. మీరు లేదా ఆహారాన్ని ప్రేమ పూర్వకంగా సమర్పించడం హిందూ మతంలోని ముఖ్యమైన ఆచారం.దేవుడిని ఆరాధించే రూపంలో దైవత్వం కనిపిస్తుంది. హిందూ మతంలో వివిధ సందర్భాలలో వివిధ తర పూజలు చేస్తారు. ఇది […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 February 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Daiva Pooja : దైవ పూజ, నియమాలు, దోష పరిహారాలు.. ఖాళీ కడుపుతో పూజ చేయడంలో ఉన్న గొప్ప రహస్యం...!

Daiva Pooja : హిందువులు, బౌద్ధులు, జైనులు దేవతలకు భక్తిశ్రద్ధలతో చేసే ప్రార్థన కూడా పూజ అనే అంటారు. చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం కోసం పూజలు చేస్తూ ఉంటారు. పూజ అనే సంస్కృత పదానికి గౌరవం, నివాళి. ఆరాధన అని అర్థాలు ఉన్నాయి. మీరు లేదా ఆహారాన్ని ప్రేమ పూర్వకంగా సమర్పించడం హిందూ మతంలోని ముఖ్యమైన ఆచారం.దేవుడిని ఆరాధించే రూపంలో దైవత్వం కనిపిస్తుంది. హిందూ మతంలో వివిధ సందర్భాలలో వివిధ తర పూజలు చేస్తారు. ఇది ఇంట్లో చేసే రోజు వారి పూజ కావచ్చు. లేదా అప్పుడప్పుడు ఆలయాల్లో చేసుకునే వేడుకలు కావచ్చు.. వార్షిక పండగలు కావచ్చు.. ఇతర సందర్భాల్లో శిశు జననాలు లేదా వివాహం వంటి కొన్ని జీవితకాల సంఘటనలకు కూడా గుర్తుగా లేదా కొత్త వ్యాపార ఉద్యోగాలను మొదలుపెట్టే సందర్భాల్లో కూడా పూజలు చేస్తూ ఉంటారు.

జీవితంలో కొన్ని దశలు సంఘటనలు సందర్భంగా లేదా దుర్గా పూజ లక్ష్మీ పూజ వంటి కొన్ని పండగలలో కూడా ఇంట్లోనూ దేవాలయాల్లోను పూజలు చేసుకుంటూ ఉంటారు. సంబంధించిన ప్రచారం కూడా జోరుగా సాగుతుంది అంటే ముఖ్యమైన రోజుల్లో కావచ్చు లేకపోతే ప్రత్యేకమైన సందర్భాల్లో కావచ్చు ప్రత్యేకమైన పండగల రోజుల్లో కావచ్చు ఉపవాస దీక్షను కూడా ఆచరిస్తూ ఉంటారు.అయితే పూజ చేసే సమయంలో కోసం మీ కుటుంబ సభ్యుల్ని అందరిని కూడా డిస్టర్బ్ చేయటం వారిని నిద్రలో నుండి లేపడం వృద్ధులు ఉన్నా కానీ లేకపోతే నైట్ డ్యూటీ చేసి వచ్చిన వారు కానీ లేకపోతే చిన్న పిల్లలు ఇలా అందరిని నిద్రలేపి అంత ఇల్లంతా కూడా చక్కదిద్దుకొని శుబ్రం చేసుకొని ఆ తర్వాతే పూజ చేసుకోవాలి అనే నియమం మీరు అస్సలు పెట్టుకోకూడదు.మీరు మీ యొక్క పూజ గది వరకు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ పడుకుని ఉన్నా సరే మీరు ఉదయాన్నే పూజ చేసుకోవాలనుకుంటే మీ మట్టుకు మీరు స్నానం చేసి మీ పూజకి గదినీ శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు.

అలాగే అల్పాహారం సేవించిన తర్వాత కూడా పూజ చేసుకోవచ్చు.. ఖాళీ కడుపుతో పూజ చేసుకోవాలి అనే ఆచారం ఎందుకు వచ్చిందంటే మనం మన కడుపునిండా తిన్న తర్వాత పూజకి గనక కూర్చున్నట్లయితే ఆయాసం వస్తుంది. నిద్ర వస్తుంది. అందుకని అటువంటి నియమం పెట్టారు. కానీ మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మన యొక్క ఆరోగ్యం సహకరించకపోయిన కానీ ఖాళీ కడుపుతో పూజ చేసుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అటువంటి నియమం అయితే ఏదీ లేదు. ఆ విధంగా ఎటువంటి నియమం అనేది లేదు. ఉపవాసాలు ముఖ్యంగా మీ ఆరోగ్యం సహకరించిన వారు చేసుకోవచ్చు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. ఇటువంటి అపోహలను నమ్మి మీరు పూజ చేసుకునే విధానంలో మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే కనుక అది మీ ఆరోగ్యానికి మీ కుటుంబానికి హానికరంగా మారుతుంది.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది