Devotional News : దేవుడి ముందు పిండి దీపం వెలిగించవచ్చా… లేదా..?
Devotional News : మన హిందూ సాంప్రదాయంలో దేవుడి ముందు దీపం వెలిగించకుండా పూజ పూర్తి కాదు. ఎటువంటి శుభకార్యమైన దీపాలను కచ్చితంగా వెలిగిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో నాలుగు లేదా ఐదు దీపాలను కూడా వెలిగిస్తారు. అంతేకాకుండా ప్రత్యేక వత్తి, ఆవాల నూనె మొదలైనవి కూడా దీపంలో ఉపయోగిస్తారు. ఇందుకు మట్టితో పాటు ఇత్తడి దీపం, పిండి దీపం కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టడం వలన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయని నమ్ముతారు. అగ్ని దేవుని సాక్షిగా ఏ పని చేసిన విజయం వరిస్తుందని చెబుతారు. దీపాన్ని జ్ఞానానికి గుర్తుగా భావిస్తారు. ప్రజలు ఇళ్లల్లో రాగి, ఇత్తడి, మట్టితో చేసిన ప్రమిదల ద్వారా దీపాలను వెలిగించి దేవుడిని కొలుస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో పిండి దీపాలు వెలిగిస్తారు. అయితే దీనికి ఒక కారణం ఉంది.
జ్యోతిష్య శాస్త్రంలో పిండిదీపం చాలా శక్తివంతమైన పరిగణించబడుతుంది. ఇది జీవితంలో అతిపెద్ద సమస్యలను కూడా అధిగమించగలదు. పిండి దీపం వెలిగించడం వలన ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో పిండి దీపాలు వెలిగిస్తారు. సాధారణంగా కోరికలు తీర్చుకోవడం కోసం పిండి దీపాలు వెలిగిస్తారు. దీనికోసం ఎల్లప్పుడు పిండి దీపాలు సంఖ్యను తగ్గించడం పెంచడం చేస్తుంటారు. 11 రోజులు దీపాలు వెలిగిస్తే మొదటి రోజు 11 దీపాలు రెండవ రోజు పది దీపాలు చివరి రోజు ఒక దీపం మాత్రమే వెలిగించాలి. ఒకవేళ ఒక దీపంతో వెలిగించడం ప్రారంభిస్తే చివరి రోజు 11 దీపాలను వెలిగించాలి. మీ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఇష్ట దైవం ముందు దీపం వెలిగించాలి.
ఆర్థిక సమస్యల నుండి బయట పడాలంటే లక్ష్మీదేవి ముందు 11 రోజులపాటు పెరుగుతున్న లేదా తగ్గుతున్న క్రమంలో పిండి దీపాలను వెలిగించాలి. దీంతో కొన్ని రోజుల్లోనే ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. పిండిలో పసుపు కలిపి దీపం చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే విష్ణువు కూడా ఆశీర్వదిస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో అపారమైన ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. దీంతోపాటు ప్రతి పనిలో విజయం వరిస్తుంది. అప్పుల బాధతో ఉన్న వారు ఆంజనేయ స్వామి ముందు పిండి దీపం వెలిగించాలి. దీంతో ఆస్తి సమస్యలు కూడా తొలగిపోతాయి. పదే పదే ధన నష్టం వస్తే శని దేవుని ముందు పిండి దీపం వెలిగించాలి. అన్ని అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అన్నపూర్ణ దేవి ముందు పిండి దీపాలు వెలిగించడం వలన ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి జాతకంలో రాహు కేతు దోషాలు తొలగిపోవాలంటే దేవుడి ముందు పిండి దీపం వెలిగించాలి. శనివారం రోజున ఆవ నూనెతో దీపం వెలిగిస్తే శని గ్రహదోషాలు తొలగిపోతాయి.