Lord Shiva : సొంత గృహం కావాలంటే ఏం చేయాలో తెలుసా… స్వయంగా శివుడు చెప్పిన రహస్యం…
Lord Shiva : అందరూ ఆడవాళ్లు సొంత ఇల్లు ఉండాలి. లేదా కొనుక్కోవాలి. అని అనుకుంటూ ఉంటారు. ఈ ఆలోచన మగవారిలో కూడా వస్తే ఆడవారు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఏ మహిళకు సొంత గృహం ఉంటుందో ఆ మహిళ ఆనందం మనం చెప్పనక్కర్లేదు… సొంత గృహం కావాలంటే అసలు ఏం చేయాలో ఒక కథ రూపంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఒకనాడు శివుడి భార్య పార్వతి స్వామి మనకి సొంత గృహం కావాలి అని అడుగుతుంది. అప్పుడు శివయ్య అవునా దేవి నీకు ఈ మంచు కొండలు ప్రకృతి వాతావరణం నచ్చలేదా అని అంటాడు. అప్పుడు పార్వతి మన పిల్లలు పెద్దగా అవుతున్నారు. వాళ్లకి సంబంధంనాకి వచ్చిన పిల్లవాళ్ళు పిల్లవాడికి ఏ ఆస్తి లేదా అని అడుగుతారు. అందుకే మన లోకంలోని మంచి గృహం నిర్మించుకుందాం అని చెప్తుంది. అప్పుడు శివుడు విశ్వకర్మను పిలిపించి మంచి గృహాన్ని నిర్మిస్తాడు.
గృహం మొత్తం పూర్తయ్యాక గృహప్రవేశం చేయటం కోసం బ్రాహ్మణోత్తముడు అయినటువంటి రావణబ్రహ్మణులు పిలిపించారు. ఎందుకంటే అప్పుడు రావణబ్రహ్మ బ్రాహ్మణోత్తముడు సర్వ శాస్త్రాలు అధ్యయనం చేశాడు. శివ భక్తుడు కూడా అందుకని రావణబ్రహ్మకు కబురు పంపారు. సాక్షాత్తు పరమేశ్వరుడే తన గృహప్రవేశానికి నన్ను పిలిచాడు అని చెప్పి రావణబ్రహ్మ ఎంతో సంతోషించాడు. రావణబ్రహ్మ ఆనందంతో వచ్చి ఆ ఇల్లు చూడగానే ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇలాంటి గృహం నాక్కూడా ఉంటే ఎంత బాగుండేది అని మనసులో అనుకున్నాడు. శివుడికి ఆ విషయం అర్థమై తధాస్తు అన్నాడు. గృహప్రవేశానికి అందరూ వచ్చారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి బ్రహ్మదేవతలందరూ కూడా వచ్చారు విశ్వకర్మ చాలా గొప్పగా గృహం కట్టాడని చెప్పుకున్నారు. అలాగే రావణబ్రహ్మ బాగా పూజ జరిపించాడు. ఇంత గొప్పగా మంత్రాలు చదివిన వారిని ఎవ్వరిని కూడా చూడలేదు.
రావణబ్రహ్మ చక్కగా చదివాడని రావణబ్రహ్మణులు కూడా పొగిడారు పార్వతీదేవి ఎంతో సంతోషించి నాయన రావణ నీకు ఏం కావాలో కోరుకో అని రావణుని అడిగింది. అప్పుడు పార్వతీ వైపు పరమేశ్వరుడు చూస్తూ పార్వతి ఏం కావాలో కోరుకో అని అడగటం మంచిది కాదేమో ఒక్కసారి ఆలోచించు అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి నా ఈ ఆనంద సమయంలో ఏం కోరిన ఇచ్చేస్తాను అని చెప్పింది. అప్పుడు రావణబ్రహ్మ అమ్మ నీవు ఏమి అనుకోకపోతే ఈ గృహం నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్న అన్నాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని వైపు ఆశ్చర్యంగా చూసింది. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. పార్వతి మనం కేవలం ఈ ఒక్క గృహానికి పరిమితం అయిపోతే లోకంలో ఉండే జనులందరూ నిరాశ నిస్సృహాలకు గురి అవుతారు. ఎందుకంటే మనం లోకోత్తర కళ్యాణం కోసం ఆదిదంపతులుగా ఉన్నాం.. కాబట్టి తప్పనిసరిగా లోక కళ్యాణార్థం ప్రతి ఇంట్లోనూ మనం ఉండాలి. మనం సృష్టించిన లోకంలో ప్రతి గృహంలోనూ కూడా మొదట మనల్ని కొలవాలి. ప్రతి గృహం మన ఇల్లే అవుతుంది. సుమ అనే శివుడు చెప్పినప్పుడు పార్వతీదేవికి అర్థమయ్యింది.
ఓహో ఇదంతా సర్వేశ్వరుని లీల అనుకుని పార్వతీదేవి సరే స్వామి అని చెప్పి రావణబ్రహ్మకు అద్భుతమైన గృహాన్ని ఇచ్చేసింది. ఆ గృహమే లంకా నగరంలో ఇప్పటికీ ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే పార్వతీ పరమేశ్వరులను కొలవకుండా శంకుస్థాపనధి, కార్యక్రమం, గృహప్రవేశం ఇటువంటి ఎటువంటి కార్యక్రమాలు కూడా పార్వతీ పరమేశ్వరులను కొలవకుండా చేయరాదు. గృహం కట్టుకునే ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిన నీయమము ఇది. అందుకే భూమిని తీసుకున్నప్పుడు ఆ భూమిలో శంకుస్థాపన పూజ చేసేటప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటం నుంచి తర్వాతే శంకుస్థాపనధి కార్యక్రమాలు చేసి ఆ పార్వతీ పరమేశ్వర యొక్క అనుగ్రహాన్ని పొంది. దైవచింతలతో చక్కటి గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అనేది దీనిలో ఉన్న అసలు సూత్రం కాబట్టి ఇల్లు కావాలి.. కొనుక్కోవాలి.. కట్టుకోవాలి.. అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ పార్వతీ పరమేశ్వరులను వేడుకుంటే తప్పకుండా వారికి గృహం అనేది సమకూరుతుంది.