Dhanshakti Rajyog Effect : 101 ఏళ్ల తర్వాత ధనశక్తి రాజయోగం.. ఈ రాశుల వారికి కోటీశ్వర యోగం
ప్రధానాంశాలు:
Dhanshakti Rajyog Effect : 101 ఏళ్ల తర్వాత ధనశక్తి రాజయోగం.. ఈ రాశుల వారికి కోటీశ్వర యోగం
Dhanshakti Rajyog Effect : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాజ యోగాలు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంటాయి. అంతేకాకుండా ఒక తేదీ, నక్షత్రంలోని 100 లేదా 200 ఏళ్ల తర్వాత ఏర్పడిన రాజయోగాలు మళ్లీ భవిష్యత్‌లో అదే తేదీల్లో రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ధనశక్తి రాజయోగం కూడా 101 సంవత్సరాల తర్వాత ఏర్పడి మళ్లీ జూన్ 29వ తేదీన ఏర్పడబోతోంది. కుజుడు, శుక్రుడు మేషరాశిలో కలుసుకోవడం వల్ల ఇది ఏర్పడుతోంది. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ధనశక్తి రాజయోగంతో ఈ రాశుల వారు సంపన్నులు అవుతారు.
కర్కాటక రాశి
సులభంగా విజయాలు సాధిస్తారు. అందుకు అదృష్టం తోడుంటుంది. శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉండటంతో వీరి సంపాదన భారీగా పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. అదనంగా ఆదాయ వనరులు కూడా తోడవుతాయి. డబ్బులు పొదుపు చేస్తారు. పెట్టుబడులు పెడతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి.
వృశ్చిక రాశి
శుక్రుడి ప్రభావంతో ఈ రాశి వారికి ఆనందం రెట్టింపు అవుతుంది. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. కొత్తగా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఆస్తుల పరంగా మంచి శుభవార్తను వింటారు.
మిథున రాశి
ఈ రాశివారి కష్టాలన్నీ తొలగిపోతాయి. కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగస్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.