Puja Time : పూజ సమయాల్లో కచ్చితంగా చేయాల్సినవి, చేయకూడనివి!
Puja Time : మన హిందూ సంప్రదాయాల ప్రకారం పూజలు, పునస్కారాలు చేయడం పరిపాటే. అయితే కొందరు రోజూ దీపం పెట్టడం, మరి కొందరు నచ్చిన వారాల్లో దీపం పెట్టడం కూడా తరచుగా జరిగేది. అయితే ఉదయమే అంటే సూర్యుడు ఉదయించడానికి ముందే లేవాలి. వెంటనే వాకిలి ఊడ్చి.. కల్లాపి జల్లాలి. చక్కగా ముగ్గు పెట్టుకొని, గడపలు కడుక్కొని పసుపు రాసుకోవాలి. ఆ తర్వాత ముగ్గు పెట్టాలి. అది అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని పొయ్యి దగ్గర శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత దానికి కూడా పసుపు, కుంకుమలు పెట్టాలి. అ తర్వాత తన స్నానం చేయాలి. స్నానం చేసి వచ్చిన వెంటనే బొట్టు పెట్టుకోవాలి. దీపం పెట్టే రోజుల్లో దీపం పెట్టుకోవాలి.
ఆ తర్వాతే వంట పని ప్రారంభించుకోవాలి. అయితే మధ్యాహ్న వేళ కాసేపు పుడుకున్న పర్లేదు కానీ సూర్యుడు అస్తమించక ముందు పడుకొని మరుసటి రోజు ఉదయం అస్సలే లేవకూడదు.అలాగే నోములూ, వ్రతాలూ చేసే రోజు తలకు నూనె పట్టడం, దువ్వడం వంటివి అస్సలే చేయరాదు. శని, ఆది, మంగళ వారాల్లో కొత్త వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కొనరాదు. అలాగే స్నానం చేయకుండా పొయ్యి వెలిగించ వద్దు. శుక్ర వారాలు ప్రయాణాలు చేయరాదు. తొలుతగా ముందు మీరు పెట్టుకున్న తర్వాతే ఇతరులకు బొట్టు పెట్టాలి. పూజ సమయ రోజుల్లో నమంచి నీళ్లు, మజ్జిగా మీ చేతులతో వడ్డించ కూడదు. ఇతరుల నుంచి ఉప్పు, నూనె అస్సలే తీసుకోకూడదు. గడపని కాలితో తొక్కకుండా జాగ్రత్త వహించాలి.
గడప బయట నుంచి లోపల వస్తువుని బయటకు తీసుకురారాదు. అలాగే బయట వస్తువులని గడప అవతల పెట్టరాదు. రాత్రి భోజనంలో పెరుగుని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. అంతే కాదండోయ్ సాయంత్రం దీపం పెట్టిన తర్వాత కానీ లైట్లు వేసిన తర్వాత కానీ ఇల్లూ, వాకిలి ఊడ్చ కూడదు. అలాగే పూజలు, వ్రతాలు, దీపం పెట్టే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నీచు, మాసం తినరాదు. అలాగే భర్తతో కలయికలో పాల్గొంటే కచ్చితంగా మురసటి రోజు ఉదయం లేవగానే తలస్నానం చేయాలి. స్నానం చేసేంత వరకు ఎలాంటి వాటిని ముట్ట కూడదు. అలాగే మన ఇంటికి సంబంధించి వారు ఎవరైనా పడ్తే… 41 రోజుల పాటు దీపం పెట్ట కూడదు.