
Chanakya Niti stay in such places is not wrong for anyone
Chanakya Niti : ఆచార్య చాణక్య నీతి శాస్త్రం ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే. దౌత్యం, ఆర్థికశాస్త్రం, రాజకీయంగా చాణక్య చెప్పిన మాటలను చాలా మంది ఇప్పటికీ పాటిస్తారు. నేటి యువత కూడా చాణ్య నీతిని ఆచరిస్తున్నారు. చాణక్య తెలిపిన విధానాలు కొంతవరకూ కఠినంగా అనిపించినప్పటికీ, వీటిని జీవితంలో అమలుచేస్తే, సంతోషకరమైన జీవితాన్ని అందుకోవచ్చు. అయితే చాణక్య తన నీతి శాస్త్రంలో మానవులు అవలంభించాల్సిన ఎన్నో విషయాలు తెలియజేశాడు. ఏవిధంగా ముందుకు వెళ్తే విజయం సాధిస్తారో.. అలాగే మనుషులు డబ్బు ఉంటే ఎలా ఉంటారో.. స్వార్థం వంటి విషయాలు చెప్పాడు. భార్యభర్తలు ఏవిధంగా ఉండాలో.. ఎటువంటి స్త్రీలతో స్నేహం చేయాలో వివరించాడు.
అలాగే లైఫ్లో ఎదిగే క్రమంలో ఎవరికి దూరంగా ఉండాలో తెలిపాడు. చెడు సవాసాలు చేస్తే తమ జీవితం నాశనమవడమే కాకుండా ఇతరుల జీవితాలు కూడా పాడవుతాయిని చెప్పాడు. అందుకే అటాంటి వారితో స్నేహం చేయొద్దని తెలిపాడు. కాగా చాణక్య నీతి ప్రకారం ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం… చాణక్య నీతి ప్రకారం చెడు సావాసాలు, చెడు ప్రాంతాల్లో ఉండేవారు.. చెడుగానే ఆలోచిస్తారని అలాంటి వారితో స్నేహం చేస్తే తమ ఆలోచనలు కూడా చెడుగా ఉండే ప్రమాదం ఉందని చెప్పాడు. అలాంటి వారితో ఉంటే చెడు ప్రభావం ఇతరులపై కూడా పడుతుందని వివరించాడు. కొంతమంది చెడు దృష్టితో ఉంటారు.
Do not be friends with them at all Chanakya Niti
వారు ఏవిధంగా నైనా చెడు చేసే అవకాశం ఉంటుంది. ప్రతిదీ వారు చెడుగానే చూస్తారు. అలాంటి వాళ్లతో స్నేహం చేస్తే మనల్ని మన చుట్టూ ఉన్న వాళ్లని కూడా చెడుగా చూస్తారని అందుకే వాళ్లకు దూరంగా ఉండాలని సూచించాడు. అలాగే చెడు అలవాట్లు, సోమరితనం ఉన్న వ్యక్తులతో స్నేహం చేస్తే తమ గౌరవం కూడా కోల్పోతారని అందుకే వారికి దూరంగా ఉండాలని చెప్పాడు. సోమరితనంతో కష్టపడటానికి ఇష్టపడని వ్యక్తులు తమ చుట్టు ఉన్నవారిని కూడా అలాగే తయారు చేస్తుంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్న వ్యక్తి కూడా ఇతరులపై ప్రభావం చూపుతాడు. అందుకే వారికి దూరంగా ఉండాలని చాణక్య సూచించాడు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.