KCR : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టి చాలాకాలమే అయ్యింది. ఇదిగో పులి అంటే.. అదిగో తోక.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ‘మీ ఆశీర్వాదం వుంటే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదాం.. తెలంగాణ నుంచే దేశాన్ని మార్చే శక్తి తయారవుతుంది..’ అంటూ తనను తాను ప్రధాని అభ్యర్థిగా తెలంగాణ ప్రజల దృష్టిలో ఓ ముద్ర వేసెయ్యాలని కేసీయార్ చాలా ప్రయత్నించారు. వాగ్ధాటి విషయంలో కేసీయార్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? తిమ్మిని బమ్మిని చేయగల వాక్చాతుర్యం ఆయన సొంతం.జాతీయ రాజకీయాల పట్ల కేసీయార్‌కి అవగాహన వుంది. దాన్ని కాదనలేం.
అయితే, దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే శక్తి తెలంగాణ రాష్ట్ర సమితికి లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అయితే, మొత్తంగా చూసుకున్నప్పుడు సంఖ్యా బలం పరంగా చాలా బలంగా వుండేది తెలుగు నేల. ఇప్పుడు పరిస్థితి అది కాదు. పార్లమెంటు సభ్యుల పరంగా చూసుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ చిన్న రాష్ట్రం. అలాంటప్పుడు, తెలంగాణ తొలుత ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీతోనో, జనసేన లేదా టీడీపీ లాంటి పార్టీలతోనో మంతనాలు జరిపి వుండాలి. కానీ, అలా చేయలేదు తెలంగాణ రాష్ట్ర సమితి. వైసీపీతో గతంలో టచ్‌లోకి వెళ్ళినా, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రెండూ కలిసి, తమ ఉమ్మడి సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రద్ధ, ఆసక్తి చూపలేకపోయింది.
ఇలాంటి తప్పిదాలన్నీ చేసేసి, ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేయాలనుకుంటే ఎలా.? అది సాధ్యమయ్యే పని కానే కాదు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. వైసీపీతో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి ఉమ్మడి కార్యాచరణ తెలుగు నేల నుంచి మొదలు పెడితే, మిగతా రాష్ట్రాలూ కలిసొచ్చే అవకాశం వుంటుందేమో. లేదూ, ఇలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ కేసీయార్ ‘జాతీయ రాజకీయం’ పేరుతో కాలక్షేపం చేయాలనుకుంటే, ఇక అనుకోవడానికేమీ వుండదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అనే స్థాయిలో కేసీయార్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాల్సి వుంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.