Puja Room : శుక్రవారం నాడు పూజ గది శుభ్రం చేస్తే.. ఇక అంతే!
Puja Room : ప్రతీ శుక్రవారం పూజ చేయడం చాలా మందికి అలవాటు. అందులోనూ లక్ష్మీ దేవికి ఆరోజు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అందులో భాగంగానే శుక్రవారం ఉదయం లేవగానే కల్లాపి జల్లి ముగ్గులు వేసి… గడపకు పసుపు రాసి పూజ చేసేందుకు సిద్ధం అవుతారు. ఆ తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేస్తుంటారు. దేవుడి పటాలతో పాటు విగ్రహాలు తీసి ఆ మందిరాన్ని శుభ్రం చేస్తారు. ఆ తర్వాత దీపపు కుందులు వంటి వాటిని చక్కగా కడుక్కొని మళ్లీ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటుంటారు. ఇలా శుక్రవారం అమ్మ వారిని శుచి, శుభ్రత పాటిస్తూ… పూజించండం వల్ల ఆ లక్ష్మీ దేవి కరుణ మనపై ఉంటుందని భావిస్తారు. ఆ తల్లి దయ వల్ల ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు రావని అనుకుంటారు. కానీ శుక్రవారం మీరు ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మ వారికి పూజలు చేసినప్పటికీ.
.. ఈ రోజును పూజ గది శుభ్రం చేయడం వల్ల పూజా ఫలం అంతా వృథాయేనని పండితులు చెబుతున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజున పూజ మందిరాన్ని కానీ పూజా సామాగ్రిని కాని శుభ్ర పరచకూడదంట.ఈ విధంగా శుక్రవారం పూజ గదిని లేదా పూజ సామాగ్రిని శుభ్రం చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం లభించదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ధనానికి అధిపతి అయిన కుబేరుడికి శుక్రవారం అంటే ఇష్టమట. అలాగే అమ్మవారు లక్ష్మీ దేవికి కూడా శుక్రవారం ప్రీతిపాత్రమైన రోజు. అలాంటి రోజు అమ్మవారితో పాటు కుబేరుడి అనుగ్రహం మనపై ఉండాలంటే శుక్రవారం పూజ గదిని శుభ్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు.
అందుకే శుక్రవారం కాకుండా శని ఆది లేదా గురు వారాలలో పూజ గదిని పూజ సామాగ్రిని శుభ్రం చేసుకోవడం ఎంతో ఉత్తమమని సూచిస్తున్నారు.ఆదివారం పూజ గదిని పూజా సామాగ్రిని శుభ్రం చేయడం వల్ల కంటికి సంబంధించిన దోషాలు తొలగిపోయి కంటి చూపు మెరుగుపడుతుందని మన పూరాణాలు చెబుతున్నాయి. గురువారం రోజు ఉదయానే లేచి పూజా మందిరాన్ని, సామాగ్రిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల గురుడి అనుగ్రహం ఎల్ల వేళలా మనపై ఉంటుందట. అలాగే శనివారం నాడు పూజ గది శుభ్రం చేసి పూజ చేయటం వల్ల వాహన ప్రమాదాలు తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇలా శని, ఆది, గురు వారాల్లో మాత్రమే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజ చేస్తేనే… ఆ అమ్మవారు లేదా స్వామి కటాక్షం మనపై ఉండి.. పూజా ఫలం లభిస్తుందట.