God Photos : పూజ గదిలో దేవుడి ఫోటోలు ఏ దిక్కున పెడితే మంచిది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

God Photos : పూజ గదిలో దేవుడి ఫోటోలు ఏ దిక్కున పెడితే మంచిది…!!

 Authored By aruna | The Telugu News | Updated on :5 November 2023,12:00 pm

God Photos : కర్మ సిద్ధాంతం నమ్మి వారి కాదు.. ఇతర సాంప్రదాయాలను నమ్మేవారు కూడా దేవుడికి ఒక ప్రదేశాన్ని కేటాయిస్తారు.. పొద్దున్నో.. సాయంత్రం ఆ ప్రదేశంలో పూజా ధ్యానం ఇలా ఏదో ఒకటి చేస్తుంటారు. ఇక కర్మ సిద్ధాంతం నమ్మే వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వారు ఇంట్లో తప్పక దేవుడికి ఒక మందిరం లేదా ప్రదేశాన్ని కేటాయించి నిత్యం అర్జిస్తూ ఉంటారు. అయితే ఆ దేవుడి గదిలో ఏముంచాలి. ఏ ముంచకూడదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా ఇంట్లో దేవుడు పటాలకు ప్రతిమలకు మనం పూజలు చేస్తూ ఉంటాము.. గృహంలో దేవుడి గది ప్రత్యేక అయితే ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు దేవుడికి అలమరాలు ఒక అరభాగాన్ని ప్రత్యేకించి ఒక మందిరాన్ని గాని లేదా ప్రత్యేకంగా ఒక గదిని గాని ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ దేవుడు గదిని పెట్టకూడదు.. దేవుడి గది కోసం వాస్తు పాటించాలి. దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయాలి అనుకుంటే ఈశాన్యం గదిని అందుకు వాడుకోవటం మంచిది. అయితే మందిరం కానీ కట్టడాన్ని నిర్మించకూడదు..

దేవుడి పటాలను ఈశాన్యం గదిలో దక్షిణ పశ్చిమ నైరుతిలో పీట వేసి గాని ఏదైనా మంచి వస్త్రము గాని వేసి పటాల ప్రతిమలు వచ్చి పూజించుకోవచ్చు.. పటాలను గోడకు వేలాడదీయాల్సి వస్తే వీలుకాని పక్షంలో తూర్పు ఉత్తర పశ్చిమ దక్షిణ వాయువ్యాలలో దేవుడి గదిని ఏర్పాటు చేసుకోవచ్చు.. నైరుతి ఆత్మీయ గదులు మాత్రం దేవుడు గదులుగా చేయకండి. ప్రత్యేకించి దేవుడి గదిని ఏర్పాటు చేయడం అనుకూలం. దేవుడి గదిలో దేవుడి ప్రతిభలు లేదా ఫోటోలు ఏవైనా ఉంచాలి అనేది అందరికీ వచ్చే అనుమానం. కొందరు తూర్పు ఉత్తరాలకు దేవుడు అభిముఖంగా ఉండాలని మరికొందరు పూజించే వారి ముఖము తూర్పు ఉత్తరాలకు అభిముఖంగా ఉండాలని చెబుతున్నారు. మీరు ఏ వైపుకు ఆ విముఖంగా ఉన్న హిందూ వాస్తుకు సంబంధం లేదని అది మనలోని భక్తికి సంబంధించిందని చెప్పవచ్చు.. అయితే ధ్యానం చేసే అలవాటు ఉంటే తూర్పు అభివృద్ధిలో కూడా పూజగదిని ఏర్పాటు చేసుకున్న తూర్పు ఉత్తర దిక్కులలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడంలో ఏమాత్రం దోషం లేదని గ్రహించండి.. దక్షిణ పశ్చిమాన వైపు పూజ గదిని ఏర్పాటు చేయడం వల్ల ఇతర అవసరాల కోసం ఇంటిలో ఎక్కువగా తూర్పు ఉత్తర భాగాలను వాడడం జరుగుతుంది. ఇది ఒక రకంగా శుభకరమని గ్రహించండి..

It is better to place God’s photos in any direction in the pooja room

మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజగదికి ఎటువైపు కూడా ఆనుకుని బాత్రూం లేదా టాయిలెట్లు ఉండకూడదు. ఇదే విధంగా పూజ గది పైన కానీ కింద గాని టాయిలెట్లో ఉండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొరపాటు చేయకూడదు.. వీటి విషయంలో అపార్ట్మెంట్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు అపార్ట్మెంట్లో ఒకరి పూజ గది పైన ఇతరులు టాయిలెట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ విషయాన్ని తేలిక తీసుకోకూడదు.. అలాగే పూజగది మీద వేసి అనవసరమైన సామానులు వేయడం చాలా మంది చేస్తుంటారు. ఇలా చేయకూడదు. దేవుడు పటాలను ఉంచి పూజ చేసుకోవడం చాలా ఇళ్లలో అలవాటుగా ఉంటే పూజ పటాలను అరుగులపై ఉంచే కన్నా మండపంలో ఉంచడం మంచిది. నేల మీద పూజ పటాలు వచ్చినప్పుడు నేలపై కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపై పూజ పటాలను ఏర్పాటు చేయాలి.అదే విధంగా అగరవత్తులు దేవుడికి వాడిన పూలను కూడా ఎప్పటికప్పుడు ఆ గది నుంచి తీసివేయాలి. ఇలా దేవుడి గదిని నిత్యం శుభ్రంగా అలంకరణంగా ఉంచుకుంటే మంచిది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది