Devotional : ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ మూడు వస్తువులు అస్సలు పెట్టకండి…!!

Devotional : ఇంటి ముందు పొరపాటున కూడా ఈ మూడు వస్తువులు పెట్టకూడదు. ఇలా గనక పెడితే మీకు అరిష్టం తప్పదు. కొన్ని వస్తువులు ఇంటి గుమ్మం ముందు పెట్టడం వల్ల యజమానికి మంచిది కాదు.. ఇంటి గుమ్మ ముందు ఏ ఏ వస్తువులు ఉండాలి.. ఏ ఏ వస్తువులు ఉండకూడదు.. ఎటువంటి వస్తువులు ఉంటే కుటుంబానికి అరిష్టం కలుగుతుంది. ఆ ఇంట్లో సుఖశాంతును వెలివేరుస్తాయో మన వివరంగా తెలుసుకోబోతున్నాం.. అలాగే ఎవరైతే శ్రీ మహాలక్ష్మి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారో వారంతా మీకు ఉపయోగపడే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఇక్కడ ఉంటాయి. వాస్తు ప్రకారం మనం ఎక్కడ ఉంటున్నాం అనేది మన ప్రస్తుతాన్ని మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అంటే మనం మన కుటుంబంతో ఉండేటువంటి ప్రాంతం

Do not put these three items at the doorstep even by mistake

మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మనం ఉండే ఇల్లు ఆ ఇంట్లో ఏఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉంటున్నాయి. ఏ ఏ వస్తువులు ఎక్కడ ఉండాలి.. ఉండకూడదు.. అనేదానికి ఒక నిర్దిష్టమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం మన ఇంటిని మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలని ఉంచుకుంటే మనకి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఈ బిజీబిజీ లైఫ్ లో పడి మనం ఎంతో ముఖ్యమైన కొన్ని అంశాలని నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం.. ఇంట్లో కాని ఇంటి బయట కానీ కొన్ని ఉంచకూడని వస్తువుల్ని ఉంచటం లేదంటే చేయకూడని పనులు చేయటం ఇలా తెలిసి తెలియక వ్యవహరించడం కారణంగా దాని యొక్క ప్రభావం మన జీవితం మీద పడుతూ ఉంటుంది. ఇదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా అష్ట కష్టాల పాలవుతూ ఉంటారు.

ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువులు ఉంచడం వల్ల వాస్తు దోషాలు పెరుగుతాయి. దీని యొక్క ప్రభావం ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులపై పడుతుంది. అంతేకాదు ఇంటి యజమానిమీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుల పాలు అవుతారు. కష్టాలు ఉంటాయి. చికాకులు మానసిక ప్రశాంతత ఉండదు. నిరంతరం ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉంటారు. ఒకదాని తరువాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు మిమ్మల్ని చుట్టేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఉంటున్నవారు ఇంట్లో పొగైనటువంటి చెత్తంతా కూడా గుమ్మం ముందు పెడుతూ ఉంటారు. దాన్ని ఏదో ఒక సమయంలో వచ్చి బయట జత కలెక్ట్ చేసేవాళ్ళు గాని వాచ్మెన్ గాని తీసుకెళ్లి బయటపడేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇంట్లో ఉన్నటువంటి చెత్తని మీ గుమ్మం దగ్గర పెడతారు. అది మీకు చెడు ప్రభావాన్ని ఇస్తుంది. వాస్తు ప్రకారం చూసినా కూడా మన ఇంట్లో చెత్తని మన ఇంటి ముందు వేయకూడదు.

ప్రధాన ద్వారం వెలుపల ఉన్న ధూళి ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని గుర్తుంచుకోవాలి. దీని కారణంగా ఉన్న ఆస్తుని అమ్మేసుకోవాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సాధారణంగా శాస్త్రాల ప్రకారం చెత్తని లేదా చెత్త డబ్బాని పనికిరాని వస్తువులని సోక అంశం అంటారు. వాటిని మన ఇంట్లో మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఎంత ఎక్కువగా ఉంచుకుంటే అంత చెడు ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి ప్రధాన ద్వారం వద్ద చెత్త ఉంటే వెంటనే తీసిపారేయండి. ఇకమీదట ఇంటి ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండేలా చూడండి. *అలాగే ప్రధాన ద్వారం దగ్గర చెట్లు మొక్కలు కూడా ఉండకూడదు. వాస్తు ప్రకారం ఇది మీ పురోగతిని అడ్డుకుంటుంది. ఇంట్లో ఉండే పిల్లలపై దీని ప్రభావం కూడా ఉంటుంది.

ఇల్లు కట్టేటప్పుడు గాని కొనేటప్పుడు కానీ మీ ఇంటి దగ్గర చెట్లు లేకుండా చూసుకోండి. ముఖ్యంగా ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఉండటం వల్ల మీ ఇంటి మీద చెడు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇంటి ముందు గనుక పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే బాల దోషం వస్తుంది. ఇంట్లో కూడా శుభానికి సూచనగా భావిస్తూ ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది. *అలాగే ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభాలు ఇతర స్తంభాలు కూడా ఉండకూడదు. దీన్ని కూడా అశుభానికి సూచనగా భావిస్తారు. దీని ప్రభావం ఇంట్లో స్త్రీల మీద పడుతుంది. అనేక సమస్యలు తలెత్తుతాయి.

అది కెరియర్ అయిన కుటుంబమైన ఏదైనా కానివ్వండి ఇంటి ముందు కరెంటు స్తంభం గాని ఇతర స్తంభాలు గాని లేకుండా చూసుకోండి. * అలాగే వాస్తు ప్రకారం ఇంటి ముందు గుడి కూడా ఉండకూడదు. అని పెద్దలు చెప్తూ ఉంటారు. లేదా మతపరమైన స్థలం ఉన్నా కూడా అనేక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. దీని ప్రభావం కూడా ఇంటి సభ్యుల మీద పడుతుంది. *అలాగే ఇంటి డోర్ పైన కిటికీ ఉండకూడదు. అని చెప్తూ ఉంటారు. ఇల్లు అందంగా కనిపించాలని చాలామంది డోర్ పైన కిటికీ పెడుతుంటారు.. అలా కూడా పెట్టకూడదు. అలా పెడితే అన్ని నష్టాలు జరుగుతాయి..

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago