Lakshmi Devi : మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే దీపావళి రోజున ఇలా చేయండి…!
Lakshmi Devi : దీపావళి పండుగ త్వరలోనే రానుంది. దీపావళికి లక్ష్మి దేవిని పూజిస్తారు. దీపావళి పండుగ లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. లక్ష్మీదేవిని సంపదల దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపన్నమైన సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే దీపావళి రోజున మీ రాశి ప్రకారం లక్ష్మీ మంత్రాలను పట్టిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముందుగా మేష రాశి వారు ” ఓం ఐం క్లీం సౌః “అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. తరువాత వృషభ రాశి వారు ” ఓం ఐం క్లీం శ్రీః ” అని మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి పూజించాలి. ఇలా చేస్తే అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
మిధున రాశి వారు ” ఓం క్లీం ఐ సౌః ” మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి ఆరాధిస్తే ఆదాయం పెరుగుతుంది మరియు డబ్బులు సమస్యలు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారు ” ఓం ఐం క్లీం శ్రీః ” అని భక్తితో మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి ఆరాధించాలి. ఇలా చేస్తే అన్ని విషయాలలో విజయాలు సాధిస్తారు. తర్వాత సింహ రాశి వారు ” ఓం హ్రీం ఐం సౌః ” అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కన్య రాశి వారు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీం ఐం సౌః నీ మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి పూజించాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు లక్ష్మీ నామస్మరణ చేయడం వలన కరుణా కటాక్షాలు కలుగుతాయి. తులా రాశి వారు ” ఓం శ్రీం క్లీం హ్రీం సిద్ధలక్ష్మి నమః ” అనే మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన జీవితం ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది.
వృశ్చిక రాశి వారు ఇంట్లో సిరిసంపదలు కలగాలంటే అమ్మవారిని ” ఓం ఐం క్లీం సౌః ” అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి. దేవి యొక్క పరి పూర్ణ అనుగ్రహం పొందవచ్చు. ధనస్సు రాశి వారు ” ఓం హ్రీం క్లీం సౌః ” అనే మంత్రాన్ని ధ్యానించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సానుకూల శక్తి మరియు అన్ని ప్రయత్నాలలో విజయం కలుగుతుంది. మకర రాశి వారు ” ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌః ” అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వలన త్వరలోనే ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటానికి కుంభ రాశి వారు ” ఓం హ్రీం ఐం క్లీం శ్రీం ” అనే మంత్రాన్ని ధ్యానించాలి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కుంభరాశి వారు లక్ష్మీదేవి విశేష అనుగ్రహాన్ని పొందుతారు. మీనా రాశి వారు ” ఓం హ్రీం క్లీం సౌః ” అనే మంత్రాన్ని జపించడం వలన అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఇలా ఒక్కో రాశి వారు ఒక్కో మంత్రం జపించడం వలన ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు.