Vayanam : మహిళలు శ్రావణమాసంలో వాయనం ఇచ్చేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి…. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vayanam : మహిళలు శ్రావణమాసంలో వాయనం ఇచ్చేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి…. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది….?

 Authored By ramu | The Telugu News | Updated on :26 July 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Vayanam : మహిళలు.. శ్రావణమాసంలో వాయనం ఇచ్చేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి.... లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది....?

Vayanam : మన సనాతన సంప్రదాయాలకు హిందూ సాంప్రదాయం అత్యంత పవిత్రమైనది. మాసం వచ్చిందంటే హిందువుల గృహాలలో ఇల్లు, వాకిళ్ళు ముగ్గులతో అందంగా అలంకరించబడి ఉంటాయి. మీ దేవికి శుభ్రత అంటే ఇష్టం. లక్ష్మీదేవి అమ్మవారు అలంకరణ ప్రియులు. ఆమె ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఆనందం, సుఖసంతోషాలు, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు, అన్ని ఉంటాయి. ఎక్కడైతే శుభ్రత ఉండదు అక్కడ వరమహాలక్ష్మి దేవి ఉండదు. అక్కడ జేష్ఠ దేవి అంటే దారితీయ లక్ష్మి అక్కడ కొలువై ఉంటుంది. దారిద్య లక్ష్మి ఉంటే ఇంట్లో అన్ని కష్టాలే. శ్రావణమాసంలో ప్రతి మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి వాయునాలు ఇస్తే ఆ స్త్రీకి సౌభాగ్యం కలుగుతుంది. మహిళలందరినీ ముత్తైదులను పిలిచి వాయునాలను ఇస్తే వారి చేత ఆశీర్వాదాలు పొందితే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి దేవి వచ్చిందని భావించి వాయునమును ఇవ్వాలి. అందరూ తెలిసి తెలియక వాహనం ఇచ్చే విషయంలో కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. తెలియక కొన్ని పొరపాట్లు పూజలో చేస్తూ ఉంటారు. తద్వారా ఫలితం తగ్గుతుంది. మరి శ్రావణమాసంలో వాయనం ఇచ్చే సమయంలో చేయకూడని పొరపాట్లు కూడా తెలుసుకోవాలి కదా. మరి అవేంటో తెలుసుకుందాం…

Vayanam మహిళలు శ్రావణమాసంలో వాయనం ఇచ్చేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది

Vayanam : మహిళలు శ్రావణమాసంలో వాయనం ఇచ్చేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి…. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది….?

శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ మాసంలో ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలా పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది. వాయునమిచ్చేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు అవేంటో తెలుసుకుందాం…

Vayanam శ్రావణమాసంలో వాయనం ఇచ్చేటప్పుడు చేయకూడని పొరపాట్లు

శ్రావణ మాసంలో ఉల్లి వెల్లుల్లి తినడం : శ్రావణవ మాసంలో శాఖాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యం, పొగాకు వంటివి పూర్తిగా మానేయాలి. అలాగే ఉల్లి,వెల్లుల్లి వంటివి కూడా ఆహారంలో చేసుకోకూడదు. అవి తామసిక ఆహారాలుగా భావిస్తారు.

శరీరానికి నూనె రాసుకోవడం : ఈ మాసంలో శరీరానికి నూనె రాసుకోవడం అశుభమని కొన్ని కాల్ కూడా ఉన్నాయి. అయితే నూనె దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు.

పగటి పూట నిద్రపోవడం : శ్రవణ మాసంలో ముఖ్యంగా వ్రతాలు చేసే రోజుల్లో పగటిపూట నిద్రపోవడం మంచిది కాదు.

తల వెంట్రుకలు లేదా గడ్డం కత్తిరించుకోవడం : పురుషులు, శ్రావణమాసంలో తల వెంట్రుకలు, గడ్డం కత్తిరించుకోకూడదు. కొన్ని ప్రాంతాలలో ఇలా నమ్ముతారు.

రాగి పాత్రలో వండిన ఆహారం తినడం : పాత్రలలో ఉండిన ఆహార పదార్థాలను ఈ శ్రావణమాసంలో తినకూడదని కొన్ని సాంప్రదాయాలు చెబుతున్నాయి.

తులసి ఆకులను శివుడి పూజలో వాడడం  : తులసి ఆకులను శివుని పూజలో అస్సలు ఉపయోగించకూడదు. శివునికి మారేడు దళాలు ప్రీతికరము.

అపవిత్రంగా ఉండడం :ఈ మాసం మొత్తం పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. ముఖ్యంగా, పూజలు చేసేటప్పుడు వాయనమిచ్చేటప్పుడు మడి, సూచి పాటించాలి.

లక్ష్మీ వ్రతం రోజు భార్యాభర్తలు దూరంగా ఉండకపోవడం : వరలక్ష్మీ వ్రతం ఆచరించే స్త్రీలు పూజకు ముందు రోజు నుంచి కూడా తరువాత రోజు వరకు పూజ రోజు కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా దూరంగా ఉండాలి. ఆ రోజు మంచం ముట్టుకోకూడదు. ఎవరైతే వ్రతాన్ని చేశారో వారు, ఆ రోజు రాత్రి నేలపైన చాప వేసుకుని నిద్రించాలి. పైన అస్సలు పడుకోకూడదు.

వాయనం ఇచ్చినప్పుడు ఆ గౌరవం చూపడం : వాయనం ఇచ్చేటప్పుడు ముత్తైదులకు గౌరవంగా ఇవ్వాలి. వారిని సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారి స్వయంగా ఇంటికి వచ్చినట్లుగా భావించాలి.వారిని ప్రేమతో గౌరవంగా చూసుకోవాలి. నేను ఇచ్చేటప్పుడు వారి పట్ల ఎలాంటి అగౌరవం చూపడం లేదా అనాధారణ చేయడం చేయకూడదు. అవమానపరచకూడదు. పవిత్ర భావంతో చూడాలి.

వాయనంలో లోపాలు : వాయనం ఇచ్చే వస్తువులు శుభ్రంగా పవిత్రంగా ఉండాలి. పాడైన లేదా ఆ శుభకరమైన వస్తువులను వాయనంగా అస్సలు ఇవ్వకండి. సాధారణంగా పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, తాంబూలం, పిండి వంటలు వంటివి ఇస్తారు. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు,వాయనాలు, భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో చేయడం వల్ల, అనుకూల ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఈ నియమాలను పాటిస్తే అమ్మవారి కృపా మీపై మీ కుటుంబం పై ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది