Thadasthu Devathalu : మనం ఏదైనా మాట్లాడగానే తథాస్తు దేవతలు వచ్చి తథాస్తు అంటారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Thadasthu Devathalu : మనం ఏదైనా మాట్లాడగానే తథాస్తు దేవతలు వచ్చి తథాస్తు అంటారా..!

Thadasthu Devathalu  : తథాస్తు దేవతల గురించి అందరూ వినే ఉంటారు. మనం ఏం మాట్లాడినా తథాస్తు దేవతలు తథాస్తు అంటారని మన పెద్దలు చెబుతుంటారు. అయితే ముఖ్యంగా మనం ఎవరినైనా నాశనం అవ్వాలంటూ తిట్టినా.. శాపనార్థాలు పెట్టినా లేదా కోపంలో నేనే చచ్చిపోతానంటూ… ఏడుస్తున్నా వెంటనే పెద్దలు అలా అనకూడదని చెబుతారు. అంతే కాకుండా తథాస్తు దేవతలు తథాస్తు అంటారని అంటుంటారు. అయితే నిజంగానే తథాస్తు దేవతలు ఉంటారా..! మనం ఏదైనా మాట్లాడగానే తథాస్తు దేవతలు […]

 Authored By pavan | The Telugu News | Updated on :22 February 2022,6:00 am

Thadasthu Devathalu  : తథాస్తు దేవతల గురించి అందరూ వినే ఉంటారు. మనం ఏం మాట్లాడినా తథాస్తు దేవతలు తథాస్తు అంటారని మన పెద్దలు చెబుతుంటారు. అయితే ముఖ్యంగా మనం ఎవరినైనా నాశనం అవ్వాలంటూ తిట్టినా.. శాపనార్థాలు పెట్టినా లేదా కోపంలో నేనే చచ్చిపోతానంటూ… ఏడుస్తున్నా వెంటనే పెద్దలు అలా అనకూడదని చెబుతారు. అంతే కాకుండా తథాస్తు దేవతలు తథాస్తు అంటారని అంటుంటారు. అయితే నిజంగానే తథాస్తు దేవతలు ఉంటారా..! మనం ఏదైనా మాట్లాడగానే తథాస్తు దేవతలు వచ్చి నిజంగానే తథాస్తు అంటారా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పురాణాల ప్రకారం మనకు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు. అయితే ఈ తథాస్తు దేవతలు మాత్రం అందులో లేరు.

మరి నిజానికి తథాస్తు దేవతలు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. కానీ మన పూర్వీకులు మనం ఎప్పుడూ మంచి మాటలే పలకాలనీ… చెడు మాటలు అస్సలే మాట్లాడకూడదని… ఇలా తథాస్తు దేవతల గురించి చెప్పారు. కేవలం మనం మంచి సంకల్పాలే చేయాలని వారు ఇలా చెప్పారు. అయితే మనం సైన్స్ ప్రకారం చెప్తే కంటే దేవుడితో ముడి పెట్టి చెప్తే… మనం కచ్చితంగా వింటామని వారి నమ్మకం. అందుకే మన పెద్దలు మన కోసం ఆలోచించి ఇలాంటివి దేవుడితో ముడిపెట్టి చెబుతుండేవారు. అయితే చెడు మాటల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా… మానసక ప్రశాంతతను కోల్పోతామని..

do you know thadasthu devathalu

do you know thadasthu devathalu

మనమే నష్టపోతాం అని కల్గుతుందట. అందుకే కలలో కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదని ఒక వేళ కోపంలో మాట్లాడినా తప్పును సరిదిద్దుకోవాలని మన పెద్దలు తథాస్తు దేవతల గురించి చప్పారు. అంతే కాదు మన మనసు ఎప్పుడూ ప్రశాంతంగా, పవిత్రంగా సంస్కారవంతంగా ఉండాలని గుర్తు చేయడానికి మన పూర్వీకులు తథాస్తు దేవతల పేర్లు వాడుకున్నరాు. అదే తథాస్తు దేవతలను ఉపయోగించి మనం కూడా చెడు మాటలను మాట్లాడకుండా ఉంటున్నాం. అయితే మంచి మాటలను మాత్రమే మనం మాట్లాడుతూ… మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకుంటూ ముందుకు సాగాలి.

Also read

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది