Categories: DevotionalNews

ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుసా?

ఒక్కొక్క లింగాన్ని పూజించి అభిషేకం చేయడం వల్ల, ఒక్కొక్క ఫలితం ఉంటుందని లింగ పురాణం చెబుతోంది. రత్న మయమైన లింగం సంపదలను ఇస్తుంది. రాతితో చేసిన లింగం సర్వ సిద్ధులను ఇస్తుంది. ధాతువుల నుంచి, అంటే పాదరసం వంటి వాటితోతయారైన లింగం ధనం ఇస్తుంది. కొయ్యతో తయారు చేసిన లింగం సర్వ భోగాలను కలిగిస్తుంది. మట్టితో చేసిన లింగం, అంటే పార్థివ లింగం అణిమాది సిద్ధులను ఇస్తుంది. శివ లింగాలన్నింటిలో రాతి లింగం అభిషేకానికి పూజకు ఉత్తమమైనదనీ, ధాతు లింగం మధ్యమ మైనదనీ, లింగ పురాణం చెబుతోంది. అలాగే మరిన్ని లింగాలను పూజించడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

do you Know The Result of worshiping which lingam

  • గంధ లింగము.. రెండు భాగాలు కస్తూరి, నాలుగు భాగాలు చంద నము మూడు భాగాలుగా కలిపి గంధ లింగమును తయారు చేస్తారు. దీనికి పూజ చేసిన శివ సాయుజ్యం కలుగుతుంది.
  • పుష్ప లింగము.. దీనిని అన్ని రకాల పూలతో నిర్మిస్తారు. ఈ విధంగా నానా విధాలైన సువాసనలు గల పూలతో నిర్మించిన పుష్ప లింగాన్ని పూజించినచో రాజ్యాధిపత్యము కలుగును.
  • గోమయ లింగము.. స్వచ్ఛమైన కపిల గోమయమును తెచ్చి లింగమును నేలపైన మట్టిలోనపడిన పేడపనికి రాదు.
  • రజోమయ లింగము.. పుప్పొడితో తయారు చేసిన లింగం వల్ల విద్యా ధరత్వము సిద్ధించును. ఆపైన శివ సాయుజ్యము పొందవచ్చును.
  • యవ గోధుమ, శాలిజ లింగము.. దీనిని యవ, గోధుమలు, తండుల పిష్టముచేత తయారు చేస్తారు. దీనికి పూజ చేసినచో సకల సంపదలు కలుగును. పుత్ర సంతానం కలుగును.
  • తిలపిష్ట లింగము: దీనిని నువ్వుల పిండితో తయారు చేస్తారు. దీనిని పూజించి నచో ఇష్టసిద్ధి కలుగును.
  • లవణ లింగము.. దీనిని హరి దళము, త్రికటుకాలు మెత్తగా పొడిచేసి ఉప్పుతో కలిపి లింగముగా చేస్తారు. దీనిని పూజించిన వశీకరణ ఏర్పడును.
  • తపోత లింగము : దీనిని పూజించిన శత్రువులు నశింతురు.
  • భస్మమయ లింగము : దీనిని పూజించిన సమస్త ఫలితాలు చేకూరును.
  • గుదోత లింగము : దీనికి పూజచేసిన ప్రీతిని కలిగించును.
  • శర్కరామయ లింగము : దీనికి పూజచేసిన అన్నిసుఖాలు కలుగజేయును.
  • దూర్వా కాండ లింగము : దీనిని గరిక కాడలతో చేస్తారు. దీనిని పూజించిన అపమృత్యువు నశించును.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

3 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

4 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

5 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

7 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

8 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

9 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

10 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

11 hours ago