Shani Jayanti : దేవతల్లో శనీశ్వరుడి స్థానం ప్రత్యేకమైనది. సనాతన ధర్మంలో దేవాతారాధన ఎంతో ముఖ్యమైనది అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. దేవదేవతలు అనుగ్రహం పొందేందుకు వివిధ రకాల పూజలు చేస్తుంటారు. జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ దేవతారాధన చేస్తుంటారు. మనశ్శాంతి కోసం గుళ్లకు వెళ్లి దేవుళ్లను పూజిస్తారు. అయితే.. దేవతల్లో కెల్లా శనీశ్వరుడి స్థానం ప్రత్యేకమైనది. ఎందుకంటే శని అనగానే మనలో చాలా మందికి గుర్తుకు వచ్చేది చెడు. జీవితం అల్లకల్లోలంగా సాగుతుంటే శని ప్రభావం ఉందని భావిస్తాం. కష్టాలు, నష్టాలు చుట్టుముడితే శని దాపురించిందని మదన పడి పోతుంటాం. ఇలా శనీశ్వరుడికి కోపం వస్తే.. మన జీవితంలో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి.శని అనుగ్రహం కోసం రకరకాల పూజలు చేస్తుంటారు చాలా మంది.
జీవితంలో వచ్చిన సమస్యలు తొలగిపోవాలని, కష్టాలు, నష్టాలు వదిలి వెళ్లి పోవాలని.. జీవితం సాఫీగా ఆనందంగా గడపాలని శనీశ్వరుడిని ఆరాధిస్తారు. శనీశ్వరుడికి ఇష్టమైన రోజున, పూజలతో పాటు నలుపు వస్తువులను దానం చేస్తారా చాలా మంది. హిందూ మత సాంప్రదాయంలో ధాన ధర్మాలకు ప్రత్యేక స్థానం ఉంది. దానం చేసే వారిని శని దేవుడి అత్యంత ప్రియమైన వారిగా భావిస్తాడని నమ్మకం ఉంది.శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఏమేం చేయాలి.. శనీ జయంతి రోజున ఏ పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాదిలో శని జయంతి ఈ నెలలోనే వస్తోంది. మే 30వ తారీఖున సోమవారం శని జయంతి వస్తుంది. మే 29 ఆదివారం పగటి పూట 2 గంటల 54 నిమిషాలకు శని జయంతి ప్రారంభం కానుంది. మే 30వ తేదీన సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. ఈసారి ఉదయమే తిథి రావడంతో మే 30న శని జయంతి జరుపుకోనున్నారు.
శని దేవుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా పవిత్ర మైనదిగా భావిస్తారు.శని జయంతి రోజున ఈ పనులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శని ప్రభావం మనపై ఉండకుండా ఉంటుంది. శని జయంతి రోజున తెల్లవారుజామునే తలస్నానం చేయాలి. ముందు ఆవాల నూనెతో మర్దన చేసి తలస్నానం చేయాలి. శని జయంతి రోజున శనీశ్వరుడికి ప్రతీ పాత్రమైన ప్రసాదాలు సమర్పించుకుంటే మంచిది. ఈ ప్రసాదాలను ఆవ నూనెతో మాత్రమే చేయాలి. ఉదయమే తలస్నానం చేసి ఆవ నూనెతో వంటకాలు సిద్ధం చేసుకోవాలి. ఆయా వంటకాలను శని పూజలో ప్రసాదాలుగా సమర్పించాలి. నల్ల నువ్వులు, ఆవ నూనె దీపం, ఇతర వస్తువులతో పూజను నిర్వహించాలి. ప్లేట్ తో గుడికి వెళ్లి శని దేవుడికి సమర్పించండి. ఆ రోజు శని చాలీసాను పఠించాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.