Sri Rama Navami : హిందూమతంలో ప్రతి పండగ కి ఓ ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అలాగే ఈరోజు జరిగే శ్రీరాముని కళ్యాణం లో కూడా ఓ ప్రత్యేకత ఉంది. శ్రీరాముని కళ్యాణం తర్వాత పులిహోర, పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు.. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందువులకు శ్రీరామనవమి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు. శ్రీరామనవమి హిందువులకి ఎంతో ప్రత్యేకమైన పండగ. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అలాగే భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే మనం ప్రతి పండగకు ఒక విశిష్టమైన ప్రత్యేకమైన ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా ఇస్తూ ఉంటాం.
ఉగాదికి షడ్రుచులు తో ఉగాది పచ్చడి. వినాయక చవితికి ఉండ్రాళ్ళు అలాగే రాములోరికి పానకాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అయితే ఎందుకు పానకమే నైవేద్యంగా పెడతారు అని ఎప్పుడైనా అనుకున్నారా..? దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాలలో సీతారాముల కళ్యాణం కన్నుల పండగ జరుపుతారు. ఆ స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని భక్తులు పరవశించిపోతారు. అందరూ ఇళ్లల్లో కూడా శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుంటారు. ఆ సీతారాములను ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో ఆరాధిస్తారు. అయితే ఇంట్లో అయినా గుడిలో అయినా శ్రీరామనవమికి నైవేద్యంగా పులిహార, వడపప్పు, పానకాన్ని సమర్పిస్తారు. అయితే పానకాన్ని ఇవ్వడం వెనక శాస్త్రంలో చాలానే కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. వాటిలో ఆరోగ్యానికి సంబంధించిన మర్మము కూడా దాగి ఉంది. అందుకే పానకాన్ని ప్రసాదంగా పంచి పెడుతూ ఉంటారు. ఉగాది అయిపోయిన తర్వాత చలి పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత నుండి ఎండలు మొదలవుతాయి.
సూర్యుడి తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెడతాడు. అలా ఎండలు మొదలైన తర్వాత శ్రీరామనవమి వస్తుంటుంది. అందుకే దేవాలయ వాళ్ళ దగ్గర తాటాకు పందిరి వేస్తారు. ఎందుకంటే వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అలాగే ప్రసాదంగా ఇచ్చే పానకం కూడా భక్తులకి శక్తిని శరీరంలో ఉన్న వేడిని తొలగించడానికి పానకాన్ని ఇస్తారు. పానకం తయారు చేయడానికి వాడే వస్తువులు చూస్తే తెలుస్తోంది. పానకం కోసం బెల్లం, మంచినీళ్లు, మిరియాలు, యాలకులు, తులసి ఆకులు వాడుతుంటారు. ఈ పానకం మనిషి ఒంట్లో ఉన్న ఉష్ణాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. బెల్లం వేడిని తగ్గించడమే కాకుండా దాంట్లో ఉన్న ఐరన్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. మిరియాలు గొంతు నొప్పిని కపం ని తగ్గిస్తాయి. దగ్గు రాకుండా ఉండడానికి రక్షిస్తాయి. అలాగే తులసి ఆకులు వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవి వైరస్ ద్వారా వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది. వేసవి మొదట్లో వచ్చే పండుగ కావున ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇలా పానకం తాగుతారని పురాణాలు చెబుతున్నాయి. పానకాన్ని ప్రసాదంగా తీసుకోవడం వలన భక్తికి భక్తి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎవరైనా పిల్లల పానకం తాగని మారం చేస్తే దాని వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అర్థం అయ్యేలా చెప్పి వారిని కూడా తాగేలా చేయండి..
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.