Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు కళ్యాణం తర్వాత పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు కళ్యాణం తర్వాత పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు..?

Sri Rama Navami : హిందూమతంలో ప్రతి పండగ కి ఓ ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అలాగే ఈరోజు జరిగే శ్రీరాముని కళ్యాణం లో కూడా ఓ ప్రత్యేకత ఉంది. శ్రీరాముని కళ్యాణం తర్వాత పులిహోర, పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు.. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందువులకు శ్రీరామనవమి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు. శ్రీరామనవమి హిందువులకి ఎంతో ప్రత్యేకమైన పండగ. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అలాగే […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 April 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు కళ్యాణం తర్వాత పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు..?

Sri Rama Navami : హిందూమతంలో ప్రతి పండగ కి ఓ ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అలాగే ఈరోజు జరిగే శ్రీరాముని కళ్యాణం లో కూడా ఓ ప్రత్యేకత ఉంది. శ్రీరాముని కళ్యాణం తర్వాత పులిహోర, పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు.. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందువులకు శ్రీరామనవమి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు. శ్రీరామనవమి హిందువులకి ఎంతో ప్రత్యేకమైన పండగ. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అలాగే భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే మనం ప్రతి పండగకు ఒక విశిష్టమైన ప్రత్యేకమైన ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా ఇస్తూ ఉంటాం.

Sri Rama Navami శ్రీరామ నవమి రోజు కళ్యాణం తర్వాత పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు

Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు కళ్యాణం తర్వాత పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు..?

Sri Rama Navami : శ్రీరామ నవమికి  పానకమే నైవేద్యం

ఉగాదికి షడ్రుచులు తో ఉగాది పచ్చడి. వినాయక చవితికి ఉండ్రాళ్ళు అలాగే రాములోరికి పానకాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అయితే ఎందుకు పానకమే నైవేద్యంగా పెడతారు అని ఎప్పుడైనా అనుకున్నారా..? దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాలలో సీతారాముల కళ్యాణం కన్నుల పండగ జరుపుతారు. ఆ స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని భక్తులు పరవశించిపోతారు. అందరూ ఇళ్లల్లో కూడా శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుంటారు. ఆ సీతారాములను ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో ఆరాధిస్తారు. అయితే ఇంట్లో అయినా గుడిలో అయినా శ్రీరామనవమికి నైవేద్యంగా పులిహార, వడపప్పు, పానకాన్ని సమర్పిస్తారు. అయితే పానకాన్ని ఇవ్వడం వెనక శాస్త్రంలో చాలానే కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. వాటిలో ఆరోగ్యానికి సంబంధించిన మర్మము కూడా దాగి ఉంది. అందుకే పానకాన్ని ప్రసాదంగా పంచి పెడుతూ ఉంటారు. ఉగాది అయిపోయిన తర్వాత చలి పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత నుండి ఎండలు మొదలవుతాయి.

Sri Rama Navami శ్రీరామ నవమి రోజు కళ్యాణం తర్వాత పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు

Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు కళ్యాణం తర్వాత పానకం ఎందుకు ఇస్తారో తెలుసా మీకు..?

సూర్యుడి తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెడతాడు. అలా ఎండలు మొదలైన తర్వాత శ్రీరామనవమి వస్తుంటుంది. అందుకే దేవాలయ వాళ్ళ దగ్గర తాటాకు పందిరి వేస్తారు. ఎందుకంటే వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అలాగే ప్రసాదంగా ఇచ్చే పానకం కూడా భక్తులకి శక్తిని శరీరంలో ఉన్న వేడిని తొలగించడానికి పానకాన్ని ఇస్తారు. పానకం తయారు చేయడానికి వాడే వస్తువులు చూస్తే తెలుస్తోంది. పానకం కోసం బెల్లం, మంచినీళ్లు, మిరియాలు, యాలకులు, తులసి ఆకులు వాడుతుంటారు. ఈ పానకం మనిషి ఒంట్లో ఉన్న ఉష్ణాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. బెల్లం వేడిని తగ్గించడమే కాకుండా దాంట్లో ఉన్న ఐరన్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. మిరియాలు గొంతు నొప్పిని కపం ని తగ్గిస్తాయి. దగ్గు రాకుండా ఉండడానికి రక్షిస్తాయి. అలాగే తులసి ఆకులు వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవి వైరస్ ద్వారా వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది. వేసవి మొదట్లో వచ్చే పండుగ కావున ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇలా పానకం తాగుతారని పురాణాలు చెబుతున్నాయి. పానకాన్ని ప్రసాదంగా తీసుకోవడం వలన భక్తికి భక్తి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎవరైనా పిల్లల పానకం తాగని మారం చేస్తే దాని వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అర్థం అయ్యేలా చెప్పి వారిని కూడా తాగేలా చేయండి..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది