Turmeric : స్త్రీలు కాళ్లకు పసుపును పెట్టుకుంటారు ఎందుకో తెలుసా…?
ప్రధానాంశాలు:
Turmeric : స్త్రీలు కాళ్లకు పసుపును పెట్టుకుంటారు ఎందుకో తెలుసా...?
Women’s : మన సనాతన సాంప్రదాయం ప్రకారం. పసుపును వివిధ రకాలుగా వాడుతూ ఉంటాం. శుభకార్యాలలో, ఇంటి గుమ్మానికి ఇలా పసుపుని ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే పసుపును స్త్రీలు కాళ్లకు ఎక్కువగా రాసుకుంటూ ఉంటారు. ఇలా పసుపు రాసుకోవడం అనేది ఆచారంగా పూర్వీకుల నుండి ఇప్పటివరకు పాటిస్తున్నారు. అయితే ఆధునిక కాలంలో ఆచారం కేవలం సాంప్రదాయానికి మించి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఎక్కువగా ఆడవారు కాళ్లకు పసుపు రాసుకోవడం చాలా కాలం నుంచి ప్రగాఢ నమ్మకాలతో,విశ్వాసంతో సాంప్రదాయాలు,శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.

Turmeric : స్త్రీలు కాళ్లకు పసుపును పెట్టుకుంటారు ఎందుకో తెలుసా…?
Turmeric సాంప్రదాయాలు మరియు నమ్మకాలు:
ఎక్కువగా పసుపుని పవిత్రమైనదిగా భావిస్తుంటారు. కాళ్ళకి పసుపు రాసుకుంటే అంతా శుభం జరుగుతుందని. ప్రతికూల శక్తులని తొలగిస్తుందని నమ్ముతారు. వివాహిత మహిళలు తమ సౌభాగ్యానికి గుర్తుగా పసుపును రాసుకుంటారు. అయితే పసుపుకి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇది బ్యాక్టీరియాలను నిరోధించుటకు మరియు శోద నిరోధక గుణాలను కలిగి ఉంటుంది. పసుపు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చిన్న చిన్న గాయాలను కూడా మానేలా చేస్తుంది.
Turmeric శాస్త్రీయంగా కారణాలు:
ఈ పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియాలను ఏం చంపే గుణం కూడా కలిగి ఉంటుంది. కాళ్లకు పసుపు రాసుకుంటే ఇన్ఫెక్షన్స్ మన శరీరానికి సోకవు. అలాగే కాయమైన చోట రక్తం శ్రావణి నిరోధించుటకు పసుపు యాంటీబయోటిక్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే వాపు లాంటివి తగ్గిస్తాయి. పసుపు చర్మానికి మాయిశ్చరైజర్ గా చేస్తుంది. కాల చర్మం పగిలిపోకుండా కాపాడుతుంది. అలాగే పసుపుని గుమ్మానికి పెడతారు. దీనివల్ల క్రిమి కీటకాలు మన ఇంటిలోకి ప్రవేశించవు అని నమ్ముతారు.
పసుపుని నీటిలో కలిపి, పేస్టులా చేసి రాసుకుంటే మంచిది. ఈ పసుపుని చీల మండలం నుంచి కాలివేల వరకు రాసుకోవాలి. పసుపుని కాళ్లకు రాసుకున్నప్పుడు ఎండిపోయే వరకు నీరు తగలవద్దు. పసుపుని కాళ్ళకి రాసుకోవడం ఒక సాంప్రదాయమే కాదు. ఆరోగ్య ప్రయోజనాన్ని కూడా కలిగి ఉంటుంది. కొంతమందికి పసుపు అలర్జీ ఉండవచ్చు. ఇలాంటివారు పసుపుని ఉపయోగించవద్దు. అయితే ఏదేమైనా సరే. పసుపుని ఉపయోగించాలనుకుంటే మాత్రం డాక్టర్ని సంప్రదించ వలసిందే.