Devudi Mokkulu : ఆపత్కాలంలో మొక్కిన మొక్కులు ఎప్పుడు, ఎలా తీర్చుకోవాలో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Devudi Mokkulu : ఆపత్కాలంలో మొక్కిన మొక్కులు ఎప్పుడు, ఎలా తీర్చుకోవాలో తెలుసా?

 Authored By pavan | The Telugu News | Updated on :18 March 2022,6:00 am

Devudi Mokkulu : సాధారణంగా మనకు విపరీతమైన కష్టం వచ్చినప్పుడు లేదా బాధ వచ్చినప్పుడు.. అలాగే మనకు ఏవైనా కావాలని దేవుడిని కోరుకున్నప్పుడు అందుకు ప్రతిఫలంగా దేవుడికి మనం అవీ, ఇవీ చేస్తాం అంటూ మొక్కుకుంటాం. ముఖ్యంగా ఆపద సమయాల్లో అయితే ఈ ప్రమాదం నుంచి బయట పడితే… గుడికి వచ్చి మొక్కు చెల్లిస్తామని అనుకుంటాం. అయితే తమ స్థోమకు తగ్గట్టుగా ఒక్కొక్కరు ఒక్కోలా మొక్కుకుంటారు. కొందరు తల నీలాలు సమర్పిస్తామంటే కొందరు బంగారం, వెండి, డబ్బు, వస్తువులు ఇలా ఇస్తామనుకుంటారు. మరికొందరు కాలి నడకన వస్తామని, ఇన్ని ప్రదక్షిణలు చేస్తామంటూ దేవుడికి మెక్కుతారు. ఈ విధంగా ఆ భగవంతుడికి మన రకారకాలు మొక్కులు మొక్కి సమస్యల నుంచి బయటపడుతుంటాం.

కానీ చాలా మంది తాము మొక్కిన మొక్కులను మర్చిపోతుంటారు. అంటే ఆ ఆపద నుంచి బయటపడ్డ తర్వాత ఆ మొక్కు చెల్లించడానికి చాలా సమయం తీస్కుంటూ ఉంటారు. మరి కొందరు అయితే ఆ మొక్కులు చెల్లించేందుకు వెనకడుగు కూడా వేస్తుంటారు. ఇప్పుడు కాదులే మరోసారి వచ్చినప్పుడు మొక్కు చెల్లిస్తామని కూడా అంటుంటారు. ఇలా చాలా మంది భక్తులు స్వామి వారికి మొక్కులను వాయిదా వేస్తూ ఉంటారు. నిజానికి స్వామి వారికి కోరిన కోరికలు తీరిన తరువాత వెంటనే మొక్కు సమర్పించాలని వేద పండితులు చెబుతున్నారు. అయితే స్వామి వారి హుండీలో కానుకలు వేస్తామని మొక్కిన మరి కొందరు… పక్కిటి వాళ్లో, తెల్సిన వాళ్లో ఆ గుడికి వెళ్తుంటే వారి చేత డబ్బులు పంపి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు.

do you when and how to pay it devudi mokkulu

do you when and how to pay it devudi mokkulu

అయితే ఇలా పొరపాటున కూడా చేయకూడదట. ఎవరు మొక్కిన మొక్కులను వాళ్లే వెళ్లి తీర్చుకోవాలట. ఇలా వేరే వాళ్లతో పంపడం వల్ల మొక్కు తీర్చినట్లు కాదంట. కనీసం ఆ ప్రతిఫలం కూడా మనకు దక్కదట. అందుకే మొక్కులు మొక్కిన ప్రతీ ఒక్కరూ వీలయినంత త్వరగా తమ మొక్కులను చెల్లించుకోవాలి. అలాగే మొక్కిన వాళ్లే కచ్చితంగా గుడికి వెళ్లి ఆ స్వామి వారిని దర్శించుకోవాలంట. అందుకే ఏదైనా ఒక మొక్కు మొక్కితే స్వయంగా అది మన చేతుల గుండా చెల్లించినప్పుడే మనకు సరైన ఫలితం దక్కుతుంది.మొక్కిన మొక్కులను వెను వెంటనే తీర్చాలన్నది పండితులు తెలిపే మాట. నిర్లక్ష్యం చేస్తూ పోతే దాని నుండి వచ్చే ప్రతి ఫలం కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయని పలువురు పండిత నిపుణులు చెబుతుంటారు.

Also read

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది