Don't do these things in Shravana masam
Shravana Masam : ఈ సంవత్సరం శ్రావణమాసం జులై 29 నా ప్రారంభమై ఆగస్టు 27 వరకు ఉంటుంది. ఈ శ్రావణమాసం స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ మాసంలో స్త్రీలు ఉపవాసాలు ఉంటూ నోములు, వ్రతాలు, పూజలు ఇంట్లో జరుపుకుంటారు. ఈ సంవత్సరం శ్రావణంలో ఐదు సోమవారాలు వచ్చాయి. జూలై, ఆగస్టు నెలలో ఈ శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో కలుస్తాడు. అందుకే ఈ నెలను శ్రావణమాసం అంటారు. అలాగే ఈ నెలలో వర్షాలు బాగా పడతాయి. వ్యవసాయ పనులు జరుగుతాయి. అందుకే ఈ శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది. ఈ శ్రావణమాసం కొత్తగా పెళ్లయిన జంటలకు ఆషాడం మాసం ఇచ్చే దూరాన్ని శ్రావణం దగ్గర చేస్తుంది. శ్రీమహావిష్ణువు జన్మదిన నక్షత్రం అందుకే ఈ మాసంలో నారాయణుడిని పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే లక్ష్మీదేవికి ఈ మాసంలో పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే శ్రావణమాసంలో శివుడికి సోమవారం రోజున ఉపవాసం ఉండి రాత్రి ఈశ్వరుడికి రుద్రాభిషేకం, జలార్చన చేస్తే పాపాలు పోతాయని కొందరి నమ్మకం. మహిళలు పాటించే వ్రతాలు రకాల అన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే జరుపుకుంటారు. అందుకే దీన్ని వ్రతాల మాసం అని కూడా అంటారు. అలాగే సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా అంటారు. శ్రావణమాసంలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉందని పురోహితులు చెబుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో దైవాన్ని పూజిస్తే మంచి జరుగుతుందని కొందరి నమ్మకం. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన చేయడం ఉత్తమం. మంగళవారాలు మరియు శుక్రవారాలు ఏదైనా దైవిక తల్లిని పూజించడానికి ముఖ్యమైన రోజులు. శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, శ్రావణ సోమవారం, మంగళ గౌరీ వ్రతం, శ్రీకృష్ణ జన్మాష్టమి, పొలాల అమావాస్య మొదలైన పండుగలు ఈ మాసంలో వస్తాయి.
Don’t do these things in Shravana masam
అయితే శ్రావణ మాసంలో కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఇవి చేస్తే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. శ్రావణమాసంలో జుట్టును కట్ చేయకూడదు. షేవింగ్ కూడా చేసుకోకూడదు. అలాగే గోర్లు కత్తిరించడం, శరీరంపై నూనెతో మసాజ్ చేయడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే గ్రహ దోషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పెద్దలు తెలుపుతున్నారు. శ్రావణమాసంలో తొలి సోమవారం రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసం తినకూడదు. తొలి సోమవారం రోజున విలాసాలకు దూరంగా ఉండడం మంచిది. శ్రావణమాసంలో హృదయంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రానీయవద్దు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. ఉదయాన్నే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి. అలాగే శ్రావణమాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగదు.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.