Shravana Masam : శ్రావణమాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shravana Masam : శ్రావణమాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి…

 Authored By prabhas | The Telugu News | Updated on :28 July 2022,6:00 am

Shravana Masam : ఈ సంవత్సరం శ్రావణమాసం జులై 29 నా ప్రారంభమై ఆగస్టు 27 వరకు ఉంటుంది. ఈ శ్రావణమాసం స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ మాసంలో స్త్రీలు ఉపవాసాలు ఉంటూ నోములు, వ్రతాలు, పూజలు ఇంట్లో జరుపుకుంటారు. ఈ సంవత్సరం శ్రావణంలో ఐదు సోమవారాలు వచ్చాయి. జూలై, ఆగస్టు నెలలో ఈ శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో కలుస్తాడు. అందుకే ఈ నెలను శ్రావణమాసం అంటారు. అలాగే ఈ నెలలో వర్షాలు బాగా పడతాయి. వ్యవసాయ పనులు జరుగుతాయి. అందుకే ఈ శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది. ఈ శ్రావణమాసం కొత్తగా పెళ్లయిన జంటలకు ఆషాడం మాసం ఇచ్చే దూరాన్ని శ్రావణం దగ్గర చేస్తుంది. శ్రీమహావిష్ణువు జన్మదిన నక్షత్రం అందుకే ఈ మాసంలో నారాయణుడిని పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుంది.  అలాగే లక్ష్మీదేవికి ఈ మాసంలో పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే శ్రావణమాసంలో శివుడికి సోమవారం రోజున ఉపవాసం ఉండి రాత్రి ఈశ్వరుడికి రుద్రాభిషేకం, జలార్చన చేస్తే పాపాలు పోతాయని కొందరి నమ్మకం. మహిళలు పాటించే వ్రతాలు రకాల అన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే జరుపుకుంటారు. అందుకే దీన్ని వ్రతాల మాసం అని కూడా అంటారు. అలాగే సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా అంటారు. శ్రావణమాసంలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉందని పురోహితులు చెబుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో దైవాన్ని పూజిస్తే మంచి జరుగుతుందని కొందరి నమ్మకం. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన చేయడం ఉత్తమం. మంగళవారాలు మరియు శుక్రవారాలు ఏదైనా దైవిక తల్లిని పూజించడానికి ముఖ్యమైన రోజులు. శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, శ్రావణ సోమవారం, మంగళ గౌరీ వ్రతం, శ్రీకృష్ణ జన్మాష్టమి, పొలాల అమావాస్య మొదలైన పండుగలు ఈ మాసంలో వస్తాయి.

Don't do these things in Shravana masam

Don’t do these things in Shravana masam

అయితే శ్రావణ మాసంలో కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఇవి చేస్తే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. శ్రావణమాసంలో జుట్టును కట్ చేయకూడదు. షేవింగ్ కూడా చేసుకోకూడదు. అలాగే గోర్లు కత్తిరించడం, శరీరంపై నూనెతో మసాజ్ చేయడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే గ్రహ దోషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పెద్దలు తెలుపుతున్నారు. శ్రావణమాసంలో తొలి సోమవారం రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసం తినకూడదు. తొలి సోమవారం రోజున విలాసాలకు దూరంగా ఉండడం మంచిది. శ్రావణమాసంలో హృదయంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రానీయవద్దు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. ఉదయాన్నే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి. అలాగే శ్రావణమాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగదు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది