Diwali : దీపావళి పండుగ ఈ సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే ఈ దీపావళి పండుగ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంట్లో సంపద పెరగడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఇంట్లో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం. అయితే ఈ పండుగను చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ దీపావళి పండుగను ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలనే గందరగోళం మొదలైంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య అక్టోబర్ 31వ తేదీన మధ్యాహ్నం 03:52 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు నవంబర్ 01వ తేదిన సాయంత్రం 06:16 గంటలకు ముగుస్తుంది. కాబట్టి దీపావళి పండుగను నవంబర్ 01వ తేదీన జరుపుకోవడం శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు.ఇక ఈ దీపావళి పండుగ సమయంలో ఇంట్లో కొన్ని రకాల పాత వస్తువులను అస్సలు ఉంచకూడదు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చాలామంది ఇంట్లో బూట్లు పాడైన అవి దేనికో ఒక దానికి ఉపయోగపడతాయని వాటిని ఒక మూలన పెడతారు. అయితే ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే దీపావళి పండుగకి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు పాత బూట్లను చెప్పులను తొలగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో సంపదల వర్షం కురుస్తుంది.
ఇంట్లో పగిలిన గాజు వస్తువులు ఉంటే అది ప్రతికూల శక్తికి చిహ్నం. కాబట్టి ఇంట్లో పగిలిన వస్తువులు లేదా పగిలిన గాజులు ఉంటే వాటిని వెంటనే బయటపడేయండి. ఈ వస్తువులు ఇంట్లో ఉంటే ప్రతికూలత పెరుగుతుంది. ఒకవేళ ఇది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగుపెట్టదు.
పాత చిత్రపటాలు : పాత చిత్రపటాలు లేదా విరిగిపోయిన విగ్రహాలను ప్రతి ఒక్కరు వాటిని నిమజ్జనం చేయకుండా కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అలా పెట్టుకోకూడదు. వీటివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ త్వరగా వ్యాపిస్తుంది. ఇక ఇంట్లో నష్టాలు పెరుగుతాయని అంటారు.
కొంతమంది ఇంట్లో ఏళ్ల తరబడి కొన్ని పాత వస్తువులను నిల్వ చేస్తారు. ఆ ప్రదేశంలో చినిగిన బట్టలు పాత వార్తా పత్రికలు ఇతర వ్యర్థ పదార్థాలను అక్కడ పోగు చేస్తారు. ఇలాంటి వాటిని దీపావళి పండుగకి ముందే తొలగించడం మంచిది. అయితే దీపావళి పండుగ పనుల్లో ఇంట్లో ఎలాంటి చెత్త చిరిగిన బట్టలు విరిగిన విగ్రహాలు చిత్రపటాలను తొలగించడం వంటివి చేయాలి. ఇవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగుపెట్టదు. కాబట్టి వీటిని తొలగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి సంపదల వర్షం కురిపిస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.