Beauty Tips : మన చర్మ సౌందర్యానికి ఎర్రచందనాన్ని వాడారు అంటే ముఖం ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది. అయితే ఈ ఎర్రచందనాన్ని కొన్ని దశాబ్దాలుగా చర్మ సౌందర్యానికి వాడుతున్నారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఎర్రచందనంతో ఈ పదార్థాలు కలుపుకొని ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ పేస్ ప్యాక్ ను ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం.
ఎర్రచందనం, బొప్పాయి పేస్ ప్యాక్ : రెండు లేక మూడు చెంచాల ఎర్రచందనం పొడిలో బొప్పాయి గుజ్జు కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నుండి 30 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా మీరు రెండు వారాలకి ఒకసారి ట్రై చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే ఈ పేస్ ప్యాక్ ను అప్లై చేసుకోవడం వలన మీ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడమే కాక మీ చర్మం ఎంతో కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే మీ చర్మం ఆరోగ్యంగా మరియు ప్రతిరోజు తాజాగా ఉండేలా చేయడంలో కూడా ఇది ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకునేందుకు సరిపోను ఎర్రచందనం పొడిని తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల పాలు మరియు ఒక టెబుల్ స్పూన్ తేనెను కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని సుమారు అరగంట పాటు ఆరనివ్వాలి. ఇది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా గనక మీరు రెండు రోజులకు ఒకసారి ట్రై చేస్తే ముఖంపై ఉన్న మురికి అనేది తొలగిపోయి ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది…
పెరుగు, ఎర్రచందనం ఫేస్ ప్యాక్ : దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల ఎర్రచందనం పొడిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐదు నుండి పది నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా గనుక మీరు ప్రతిరోజు రాత్రి నిద్ర పోయే ముందు ట్రై చేస్తే మీకు ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే ముఖంపై ఉండే మచ్చలు మరియు మొటిమలు కూడా తొలగిపోతాయి.
ఎర్రచందనం, రోజు వాటర్ పేస్ ప్యాక్ : ఈ ఎర్ర చందనములో సరిపోను రోజువాటర్ను కలుపుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని 10 నుండి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు మీరు ట్రై చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దీంతో ముఖంపై ఉన్న మచ్చలు మరియు మొటిమలు కూడా తగ్గిపోతాయి. అలాగే ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.
ఎర్రచందనం,నిమ్మకాయ పేస్ ప్యాక్ : ఎర్రచందనం పొడిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. దానిని 15 నిమిషాల తర్వాత చల్లని వీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి గనుక మీరు ట్రై చేస్తే మీ చర్మంపై ఉన్న జిడ్డు అనేది తొలగిపోతుంది. అలాగే మీ చర్మం రంధ్రాలను బిగుతుగా చేసి ఎక్కువ నూనెలను కూడా రిలీజ్ అవ్వకుండా చేస్తుంది. అలాగే మీ చర్మం అనేది ఎంతో కాంతివంతంగా మెరిసేలా కూడా చేస్తుంది…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.