God Rings : నేటి ఆధునిక కాలంలో చాలామంది మెడలో వేసుకునే హారాలకు చైన్స్ కి నెక్లెస్ లకి మరియు చేతికి పెట్టుకునే ఉంగరాల వరకు దేవుడి ప్రతిమలో ఉన్న వాటిని ధరిస్తున్నారు. అయితే ట్రెడిషనల్ గోల్డ్ ధరించడం మంచి విషయమే కానీ వీటిని ధరించేటప్పుడు కొన్ని పద్ధతులను పాటించాలి. వీటిని ధరించడం వలన లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మరి దేవుడు ప్రతిమ ఉన్న బంగారాన్ని ధరించినప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి..? ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
చాలామంది దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలు ధరిస్తారు. కానీ వీటిని ఎలా ధరించాలో ఎవరికీ తెలియదు. ఇక దేవుడు ఉంగరాలు ధరించే ముందు పూజలు అభిషేకాలు చేసిన తర్వాత ధరించాలి. ఈ విధంగా ధరిస్తేనే వాటికి ఆ శక్తి వస్తుంది. అంతేకాదు ఈ ఉంగరాలను చేతికి ఎటువైపు ధరించాలి అనేది కూడా కొంతమందికి తెలియదు. అయితే ఉంగరానికి ఉన్న దేవుడి ప్రతిమ తల మన చేతి మణికట్టు వైపు ఉండేలా చూసుకోవాలి. ఇకపోతే చేతి పిడికిలిని బిగించినప్పుడు దేవుడు ప్రతిమ కాళ్లు కిందకి ఉండాలి. దేవుడి ప్రతిమను ఇలా ధరించడం వలన మంచి జరుగుతుంది.
దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించేవారు చాలామంది ఉంగరం పెట్టుకుని మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ విధంగా అసలు చేయకూడదు. ఇంట్లో మాంసాహారం వండినప్పుడు దేవుడి గదికి ఎలా దూరంగా ఉంటారో అదేవిధంగా దేవుడు ప్రతిమ ఉన్న ఉంగరాలను కూడా అంతే దూరంగా ఉంచాలి. కాబట్టి మాంసాహార పదార్థాలు తినేటప్పుడు దేవుడు ఉంగరాలను తీసేయండి.
చాలామంది దేవుడు ఉంగరాలను పెట్టుకుని ఎన్నో తప్పులను చేస్తారు. అందులో ఒకటి మద్యపానం ధూమపానం. ఈ అలవాట్లు ఉన్నవారు ధూమపానం మద్యపానం చేసేటప్పుడు తప్పనిసరిగా దేవుడి ఉంగరాన్ని తీసి జాగ్రత్త పడాలి. మన ఇంట్లో దేవుడు ఉన్నప్పుడు ఎలాంటి నియమాలను పాటిస్తామో అదేవిధంగా మన ఒంటిపై దేవుడి ప్రతిమలు సంబంధించిన వస్తువులు ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలను తీసుకోవాలి. దేవుడు ప్రతిమల ఉన్న ఉంగరాలను ధరించాలి అనుకునేవారు పూజ సమయంలో ధరించడం మంచిది. ఒకవేళ రోజువారీగా ధరించాలి అనుకుంటే అది మంచి కాదు.
Coriander Leaves : కొత్తిమీరను ఎన్నో రకాల వంటకాలలో వాడతాం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఏ…
Business Idea : ఇటీవలి సంవత్సరాలలో సిమెంట్ ఇటుకల వ్యాపారం సానుకూల ఫలితాలను సాధిస్తుంది. సిమెంట్ ఇటుకలు పెరుగుతున్న గ్రీన్…
Saneswara : నవంబర్ 15వ తేదీన న్యాయదేవుడైన శనీశ్వరుడు తిరోగమన దశ నుంచి సాధారణ స్థితిలోకి రాబోతున్నాడు. అయితే కర్మలను…
DRDOలో జె.ఆర్.ఎఫ్ పోస్ట్ కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. నెలకు 37000 వరకు స్టైఫెండ్ తో ఈ జాబ్స్ ఇస్తున్నారు. భారత…
Ind VS Sa : నేడు జొహానెస్‌బర్గ్ వేదికగా ఇండియా India వర్సెస్ సౌతాఫ్రికా South Africa ఆఖరి టీ…
Matka Movie Collections : మెగా హీరో వరుణ్ తేజ్ Varun Tej కరుణ కుమార్ కాంబోలో వచ్చిన సినిమా…
Diabetes : పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో మధుమేహం యొక్క అసాధారణ ప్రాబల్యం వరుసగా 45 నుంచి 60 శాతం…
Abhirami Suresh : నటి గాయని అయిన అభిరామి సురేష్ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల పట్ల ఆమె…
This website uses cookies.