Simha Rasi : శని వక్రగతి కారణంగా సింహ రాశి వారికి ఈ సమస్యలు తప్పవు..ఈ పరిహారాలు తప్పక పాటించండి…
Simha Rasi : సింహరాశి వారికి వక్రీకరణ సమయంలో అదృష్టంం పట్టబోతోంది. అలాగే శనీశ్వరుని వక్రగతి ప్రభావం వలన సింహ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి…? శని వక్రీకరించడం వలన సింహ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి…? సింహరాశి వారు ఈ సమయంలో ఏ ఏ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి… ?అదేవిధంగా వీరు ఏ దేవుడి ఆరాధనా ఎక్కువగా చేయాలి..? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
శని వక్రగత సమయం దాదాపు నవంబర్ వరకు ఉంటుంది. శని కర్మ కారకుడు అంతేకాదు క్రమశిక్షణకు కారకుడు. అసలు శని వక్రీకరణ ఏమిటి అంటే కక్షలో గ్రహాలు ఉంటాయి. భూమి మీద నుండి చూస్తున్నప్పుడు శని గ్రహం వెనుకకు వస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ అది ఒక బ్రహ్మ మాత్రమే అంతేకానీ అది వెనకకి రావడం అనేది జరగదు. దీనినే శని వక్రగతి అంటారు. ఈ సమయంలో కొన్ని విషయాలలొ జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహ రాశి అధిపతి రవి. సింహరాశి నుండి షష్ట సప్తమాపది ఆరు ఏడు ఈ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు శనీశ్వరుడు. ఆయన ఏడో స్థానంలో కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు. సహజంగా శనికి 3 7 10 దృష్టిలు ఉంటాయి. అయితే శనీశ్వరుడు సింహరాశిలో ఏడవ స్థానంలో వక్రీకరిస్తున్నాడు.
7 అంటే వ్యాపారం జీవిత భాగస్వామి బహుదూర ప్రాంత ప్రయాణం ఇటువంటి వాటిని సూచిస్తుంది. ఈ ఏడవ స్థానం అంతేకాదు ఏడవ స్థానం అంటే వివాహ వ్యవస్థ. జీవిత భాగ్య స్వామితో ఏదైనా విభేదాలు సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వ్యాపార భాగస్వామితో కూడా జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి వారు శని వక్రీకరణ సమయంలో వ్యాపార పెట్టుబడులను విస్తరింప చేయాలని ఎక్కువగా దృష్టి పెడతారు. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.అయితే సింహ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Simha Rasi : శని వక్రగతి కారణంగా సింహ రాశి వారికి ఈ సమస్యలు తప్పవు..ఈ పరిహారాలు తప్పక పాటించండి…
Simha Rasi పరిహారాలు
శనివారం శని దేవుడికి కైలాభిషేకాలు చేయించాలి. పెద్దలకు పేదవారికి వృద్ధులకు సహాయం చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చెసి ప్రదక్షిణలు చేయాలి. ఇక ఆంజనేయ స్వామి దేవాలయంలో లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఐదు నిమిషాలు ధ్యానం చేయాలి దీని వలన మంచి ఫలితాలు కలుగుతాయి.