Married Women : భర్తతో కలిసి నిద్రించే ప్రతి మహిళ ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు | The Telugu News

Married Women : భర్తతో కలిసి నిద్రించే ప్రతి మహిళ ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు

Married Women : మీకు పెళ్లయిందా? మీరు పెళ్లయిన మహిళా? మీ ఇంట్లో సుఖశాంతులు లేవా? లేదా.. మీకు సంతానం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఒక పెళ్లయిన మహిళకు ఏవైతే సమస్యలు ఉండకూడదో అలాంటి సమస్యలు ఉంటే.. అప్పులు ఎక్కువైతే.. మీరు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయో తెలుసుకుంటే మీకు ఆ సమస్యలు మరోసారి రావు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. కొందరు ఏ పని […]

 Authored By kranthi | The Telugu News | Updated on :4 November 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  భార్యాభర్తలు ఎప్పుడూ కలిసే ఉండాలి

  •  ఆలోచింపజేసే సేటు కథ

  •  భార్యాభర్తలు ఇద్దరూ కలిసే నిద్రించాలి

Married Women : మీకు పెళ్లయిందా? మీరు పెళ్లయిన మహిళా? మీ ఇంట్లో సుఖశాంతులు లేవా? లేదా.. మీకు సంతానం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఒక పెళ్లయిన మహిళకు ఏవైతే సమస్యలు ఉండకూడదో అలాంటి సమస్యలు ఉంటే.. అప్పులు ఎక్కువైతే.. మీరు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయో తెలుసుకుంటే మీకు ఆ సమస్యలు మరోసారి రావు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. కొందరు ఏ పని మొదలు పెట్టినా అది సమయానికి పూర్తి కాదు. ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. చాలామంది భార్యలు కూడా తమ భర్తపై ఎప్పుడూ కోపంతో ఉంటారు. ఇలా.. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే వస్తుంటాయి. ఎప్పుడు చూసినా ఇంట్లో ఇబ్బందులు, గొడవలు.. ఇలా రకరకాలుగా సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి వాళ్లందరూ ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఒక ఊరిలో సేటు ఉంటాడు. ఆ సేటుకు ఒకసారి చాలా కష్టాలు వస్తాయి. ఒకానొక సమయంలో చాలా ధనవంతుడు. మరొకసారి పేదవాడు అయిపోతాడు. దానికి కారణం.. దానధర్మాలు చేయడం. అయితే.. పేద సేటుకు ఎప్పుడైనా మంచి జరుగుతుందని భావించాడు. ఎవరైతే మంచిపనులు చేస్తారో ఆ మంచి పనులను రాజు గారికి చెబితే వాళ్ల మనసుకు ఏది కావాలంటే అది తీసుకొని వెళ్లొచ్చు అని దండోరా వేయిస్తాడు. ఆ దండోరాను సేటు భార్య వింటుంది. వెంటనే సేటుకు చెబుతుంది. దీంతో వెంటనే సేటు రాజుగారి మహల్ వైపు వెళ్తాడు. సగం దూరం వెళ్లాక సేటుకు చాలా ఆకలి వేస్తుంది. దీంతో తను తెచ్చుకున్న రొట్టెలను తిందామని చూసేసరికి అక్కడ ఆవు కనిపిస్తుంది. ఆవు, తన దూడ రెండు ఆకలితో ఉంటాయి. దీంతో సేటుకు ఏం చేయాలో అర్థం కాదు. తనకు ఆవుపై దయ కలిగి తను తెచ్చుకున్న రొట్టెలలో రెండు రొట్టెలను ఆవుకు పెట్టాడు. మళ్లీ సేటు వైపు చూసింది. దీంతో తన రెండు దూడులకు పాలు ఇవ్వాలి కాబట్టి తన దగ్గర ఉన్న మిగితా రెండు రొట్టెలను కూడా ఆవుకు పెట్టేస్తాడు. ఆ తర్వాత పక్కనే నదిలో ఉన్న నీళ్లను తాగి రాజుగారి మహల్ కు వెళ్తాడు.

Married Women : మీరు చేసిన మంచి పనులు చెప్పండి

మీరు చెప్పిన మంచి పనులు చెప్పండి అని రాజు.. ఆ సేటును అడుగుతాడు. దీంతో తాను చేసిన సేవలు అన్నీ చెప్పుకొస్తాడు సేటు. వీటికి బదులుగా నాకు ఏం ఇవ్వాలనుకుంటారో అది ఇవ్వండి అంటాడు సేటు. ఇప్పటి వరకు నువ్వు చెప్పినవి నాకు మంచి కర్మలుగా అనిపించలేదు. ఇంకా నువ్వు చేసిన మంచిపనులు చెప్పు అంటాడు రాజు. దీంతో ఇప్పటి వరకు నేను చేసినవి మంచి కర్మలుగా అనిపించకపోతే ఇక ఆ తర్వాత నేను చేసినవి చెప్పడం వ్యర్థం అవుతుంది అని వెనక్కి వెళ్తుండగా ఇంతలో రాజు గారికి అక్కడ దర్బార్ లో ఓ వ్యక్తి రాజు గారికి ఓ విషయాన్ని చెప్పడంతో వెంటనే సేటును వెనక్కి పిలిపించి ఈరోజు నువ్వు చేసిన మంచి పనుల గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు.

దీంతో నేనేం మంచి పని చేయలేదు అంటాడు సేటు. దీంతో రాజు.. ఆ వ్యక్తిని అడుగుతాడు. ఈ సేటు ఏం చేశాడో చెప్పు అంటాడు. దీంతో ఆవుకు పెట్టిన ఆహారం గురించి చెబుతాడు. అది జంతువులకు ఆహారం పెట్టడం ఏవిధంగా పుణ్యం అవుతుంది అంటాడు సేటు. దీంతో నిస్వార్థ భావంతో చేసిన దాన్ని చేసి మరిచిపోవాలి. అందుకే నువ్వు అర్హుడివి అంటాడు రాజు. అప్పటి నుంచి సేవకుడిగా సేటు రాజు దగ్గరే ఉండిపోతాడు.

ఇంతలో ఒక సాధువు రాజును చూడటానికి వస్తాడు. సాదువుకు భోజనాలు పెట్టి సత్కారాలు చేస్తారు. నేను మీరు చేసే సేవా భావనను చూసి చలించిపోయాను. నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి. దీన్ని మీరు మీ జీవితంలో పాటించండి అని చెబుతాడు. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఆ ఇంట్లో పేదరికం, దౌర్భాగ్యం ఉంటాయి. ప్రతి పురుషుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. భార్యలపై కోపాన్ని ప్రదర్శించకూడదు. భార్య ఇంటి లక్ష్మి. ఆమె దు:ఖపడితే ఆ ఇంట్లో ధనం నిలవదు. ప్రతి భార్యభర్తలు ఇద్దరూ ఎప్పుడూ ఒకేచోట నిద్రించాలి. ఒకేచోట నిద్రించడం వల్ల ధనం, వైభవం పెరుగుతూ వస్తాయి. దాని వల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెందుతారు.. అని చెప్పి సాధువు వెళ్లిపోతాడు.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...