Floating Stone : గంగా నదిలో తేలుతున్న రాయి .. రామసేతుతో సంబంధం ఉందంటూ పూజలు.. వీడియో వైరల్
ప్రధానాంశాలు:
Floating Stone : గంగా నదిలో తేలుతున్న రాయి .. రామసేతుతో సంబంధం ఉందంటూ పూజలు
Floating Stone : గంగా నదిలో తేలుతున్న ఓ రాయి ఘాజీపూర్‌లో కలకలం సృష్టించింది. సాధారణంగా రాళ్లు నీటిలో మునిగిపోతాయి. కానీ, ఇది మాత్రం 3 క్వింటాల బరువు ఉన్నా కూడా నీటిమీద తేలుతూ ఉండటాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ రాయిని గుర్తించిన గ్రామస్తులు దానిపై తాడు కట్టి నదీ ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రామ సేతుకి సంబంధించిన రాయి అని పదే పదే వినిపిస్తుండటంతో, ఇది పవిత్రమైనదిగా భావిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.

Floating Stone : గంగా నదిలో తేలుతున్న రాయి .. రామసేతుతో సంబంధం ఉందంటూ పూజలు.. వీడియో వైరల్
Floating Stone తేలుతున్న రాయి..
స్థానికులు, పూజారులు చెబుతున్న వివరాల ప్రకారం… ఇది రామాయణ కాలంలో రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లలో ఒకటి కావొచ్చని భావిస్తున్నారు. పౌరాణికంగా, రామసేతు నిర్మాణంలో హనుమంతుడు తేలే రాళ్లను ఉపయోగించాడన్న విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గంగానదిలో తేలుతూ కనిపించిన ఈ రాయికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ ఘటనపై అధికారులు కూడా స్పందించారు. రాయిని పరిశీలించేందుకు జియోలాజిస్టులను రంగంలోకి దింపారు. ఇది నిజంగానే రామసేతుతో సంబంధం ఉన్నదా లేక ఏదైనా శిలా ఖనిజ గుణాల వల్ల తేలుతోందా అన్నది శాస్త్రీయంగా నిర్ధారించాల్సి ఉంది.ఇదిలా ఉంటే, ఈ తేలే రాయిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం అది ఓ పవిత్ర చిహ్నంగా మారిపోయింది.
గంగా నదిలో తేలుతున్న రాయి.
ఆ రాయికి తాడు కట్టి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
రాయి 3 క్వింటాలు బరువు ఉన్న ఏ మాత్రం నీటిలో మునగడం లేదని… రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లకు దీనికి సంబంధం ఉందని అంటున్నారు.
ఈ ఘటన యూపీలోని ఘాజీపూర్‌లో జరిగింది. pic.twitter.com/te3zouhrzX
— greatandhra (@greatandhranews) July 19, 2025