Vastu Tips : మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలతో,ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఇలా చేయండి…??
ప్రధానాంశాలు:
Vastu Tips : మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలతో,ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా... అయితే ఇలా చేయండి...??
Vastu Tips : ప్రతిరోజు మీ ఇంట్లో గొడవలు జరగడం మరియు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా. అయితే మీరు ఈ సారికి ఇలా చేయండి. వాస్తు ప్రకారం చూస్తే, కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వంటగదిని ఎక్కువగా క్లీన్ గా ఉంచుకోవాలి. అలాగే మన ఇంటి వంట గదిని ఎప్పుడూ కూడా ఆగ్నేయ మూలలోనే నిర్మించుకోవాలి. ఇలా గనక లేకపోతే ఇంట్లో గొడవలు మరియు మనస్పర్ధలు రావటం కామన్…
అయితే చాలా మంది వంట గదిని ఈశాన్య మూలలోని నిర్మించుకుంటారు. అయితే మీరు ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అంతేకాక ఇంట్లో కుటుంబ సభ్యుల సఖ్యత కూడా కోల్పోతుంది అని అంటున్నారు. అలాగే వాస్తు ప్రకారం చూస్తే, వంటగది ఎప్పుడు కూడా ఆగ్నేయ మూల లోనే తూర్పు వైపు తిరిగి వంట చేస్తూ ఉండాలి. ఇదే సరైన నియమం అని అంటున్నారు.

Vastu Tips : మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలతో,ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఇలా చేయండి…??
అలాగే చాలా మంది తెలియకుండా గ్యాస్ స్టవ్ పక్కన మరియు సింక్ దగ్గర కొన్ని వస్తువులను పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం అసలు మంచిది కాదు. అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు అనేవి జరుగుతూ ఉంటే మీ కిచెన్ రూమ్ లో నల్ల నువ్వులు లేక నల్ల మిరియాలను ఒక మూటలో కట్టి పక్కన పెట్టండి. అలాగే వాటికి అప్పుడప్పుడు అగరబత్తులు కూడా చూపిస్తూ ఉండాలి. మీరు ఇలా చేయడం వలన మీ ఇంట్లో జరిగే గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి