Vastu Tips | వాస్తు దోషాలు మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నాయా ..అప్పుల బాధల నుంచి బయటపడటానికి చిట్కాలు
Vastu Tips | నేటి కాలంలో చాలామంది “మనీ ప్రాబ్లమ్స్”, “ఫైనాన్షియల్ టెన్షన్స్” అంటూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చేతిలో డబ్బు లేక అప్పుల బారిన పడటం చాలా మందికి సాధారణ విషయమైపోయింది. అయితే పండితుల ప్రకారం ఈ సమస్యలకు వాస్తు దోషాలు కూడా కారణమవుతాయంటున్నారు. మీ ఇంటిలో కొన్ని సులభమైన వాస్తు పరిహారాలు పాటిస్తే, అప్పుల బారినుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
#image_title
ఇంటి శుభ్రతే మొదటి పరిష్కారం
ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతోంది. అవసరం లేని వస్తువులను ఇంటిలో నిల్వ ఉంచకూడదు. ముఖ్యంగా ఉత్తరం దిశ కుబేరుడి దిశగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆ దిశ ఎప్పుడూ శుభ్రంగా, ఎలాంటి బరువులు లేకుండా ఉండాలి. ఇది సంపద ప్రవాహానికి మార్గం సుగమం చేస్తుంది.
వంటగది వాస్తు
వంటగదిలో వాస్తు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్టవ్, సింక్ ఒకదానికొకటి పక్కపక్కనే ఉండకూడదు. అలా ఉంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. అలాగే అప్పుల బాధలు ఉన్నవారు తమ ఇంటి ఉత్తరం దిశలో వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా డబ్బు సమస్యలు తగ్గుతాయని విశ్వాసం ఉంది.
ప్రధాన ద్వారం శుభ్రత
ఇంటిలో సంపద పెరగాలంటే ప్రధాన ద్వారం చాలా శుభ్రంగా, అలంకరించబడి ఉండాలి. ముఖ్యంగా శుక్రవారం మరియు పండుగల రోజుల్లో ప్రధాన ద్వారాన్ని పసుపు, కుంకుమతో పూజించడం పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయంటారు.