Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి.. ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది…?
ప్రధానాంశాలు:
Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి.. ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది...?
Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి, గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు, గ్రహాలకు రాకుమారుడైన బుధుడు ఆగస్టు 1వ తేదీన సంయోగం చెందుతున్నాడు.ఈ రెండు గ్రహాలు కలుసుకోవడం వల్ల బుదాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఈ రాశుల వారికి ఈ ఒకటవ తేదీ నుంచి జాతకాలు పూర్తిగా మారిపోతున్నాయి అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. మరి ఏ రాశుల వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం…

Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి.. ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది…?
Zodiac Signs మిధున రాశి
మిధున రాశి వారికి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి రెండు గ్రహాల కలయిక ఏర్పడడం చేత యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది.రాగి పాత్రలో నీళ్లు పోసి సూర్యభగవానికి అరఘ్యo సమర్పించడం ద్వారా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి,సూర్యుని పూజించడం ద్వారా మిధున రాశి వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
తులారాశి : తులారాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. సంపద వృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా ఉంటాయి. సమాజంలో గౌరవ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అన్ని తీరిపోతాయి.నవగ్రహాలకు ప్రదక్షిణ చేసే తెల్లటి వస్త్రాలను ధరించి, నేయ్యి దీపారాధన చేస్తే అన్ని శుభాలే కలుగుతాయి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
సింహరాశి : రాశి వారికి ప్రభుత్వాల నుంచి పథకాలను అందుకుంటారు. ఈ రాశి వారికి నవగ్రహాల ప్రదక్షిణ చేసి, సూర్యుని మంత్రాన్ని పఠిస్తే అంతా మంచే జరుగుతుంది. బాగా కలిసి వస్తుంది. సూర్యుడు, బుధుడు గ్రహాల కలయిక సింహ రాశి వారికి అన్నింట విజయాలే పొందుతారు.
కన్యారాశి : వారికి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఇంకా మీ ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి.పచ్చి గడ్డిని ఆవుకి తినిపిస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.ఈ రాశి వారికి అన్ని శుభాలే, విద్యార్థులకు పరీక్షల్లో విజయం పొందుతారు. గతంలో వ్యాపారాలకు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు వాటికి లాభాలను పొందుతారు.ఆదాయం కూడా పెరుగుతుంది.